ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ట్రాన్స్‌ఫార్మర్‌ను ఢీకొన్న వాహనం

ABN, First Publish Date - 2020-11-13T06:19:57+05:30

గంజాయి లోడుతో అతి వేగంగా వెళుతున్న ఓ స్కార్పియో వాహనం గురువారం మధ్యాహ్నం అదుపు తప్పి, విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్‌ను ఢీకొంది.

విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్‌ను ఢీకొట్టిన స్కార్పియో వాహనం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 బయటపడిన గంజాయి మూటలు

 పోలీసులకు సమాచారం అందించిన స్థానికులు

నర్సీపట్నం టౌన్‌, నవంబరు 12 : గంజాయి లోడుతో అతి వేగంగా వెళుతున్న ఓ స్కార్పియో వాహనం గురువారం మధ్యాహ్నం అదుపు తప్పి, విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్‌ను ఢీకొంది. ఐదురోడ్లు మీదుగా ధనిమిరెడ్డివారి వీధిలోంచి తుని రోడ్డులోకి వచ్చేందుకు ప్రయత్నిస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. దీంతో విద్యుత్‌ స్తంభం ఒరిగిపోయి అక్కడ పార్కింగ్‌ చేసి ఉన్న మరో కారుపై పడింది. తీగలు తెగి విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. పెద్దపెట్టున శబ్ధం రావడంలో స్థానికులు భయాందోళన చెందారు. కారులో గంజాయి మూటలు బయటపడడంతో పట్టణ పోలీసులకు సమాచారం అందించారు.  ప్రమాదం జరిగిన వెంటనే డ్రైవర్‌, మరో వ్యక్తి కారులోంచి దిగి పారిపోయారు. స్థానికుల సమాచారంతో పోలీసులు వాహనాన్ని స్టేషన్‌కు తరలించి, కేసు నమోదు చేశారు.

Updated Date - 2020-11-13T06:19:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising