ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రత్యేక రైళ్లు పొడిగింపు

ABN, First Publish Date - 2020-12-01T06:16:44+05:30

ప్రయాణికులు సౌకర్యార్ధం ప్రవేశపెట్టిన ప్రత్యేక రైళ్ల సర్వీసులను పొడిగిస్తున్నట్టు వాల్తేరు డివిజన్‌ సీనియర్‌ డీసీఎం ఏకే త్రిపాఠి తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విశాఖపట్నం, నవంబరు 30: ప్రయాణికులు సౌకర్యార్ధం ప్రవేశపెట్టిన ప్రత్యేక రైళ్ల సర్వీసులను పొడిగిస్తున్నట్టు వాల్తేరు డివిజన్‌ సీనియర్‌ డీసీఎం ఏకే త్రిపాఠి తెలిపారు. భువనేశ్వర్‌-తిరుపతి-భువనేశ్వర్‌(08479/08480) ఎక్స్‌ప్రెస్‌లను డిసెంబరు 27 వరకు, భువనేశ్వర్‌-చెన్నై-భువనేశ్వర్‌ (02839/02840) ఎక్స్‌ప్రెస్‌ రైళ్లను జనవరి ఒకటి వరకు, భువనేశ్వర్‌-బెంగళూరు-భువనేశ్వర్‌ (02845/02846) ఎక్స్‌ప్రెస్‌లను డిసెంబరు 29 వరకు, భువనేశ్వర్‌-పాండిచ్ఛేరి-భువనేశ్వర్‌(02898/02897) రైళ్లను డిసెంబరు 30 వరకు, భువనేశ్వర్‌-రామేశ్వరం-భువనేశ్వర్‌(08496/08495) ఎక్స్‌ప్రెస్‌ రైళ్లను డిసెంబరు 27 వరకు, పూరి-చెన్నై-పూరి(02859/02860) సర్వీసులను డిసెంబరు 28 వరకు, విశాఖ-నిజాముద్దీన్‌-విశాఖ బై వీక్లీ(02851/02852) రైలును డిసెంబరు 30 వరకు, వారానికి ఐదు రోజులు నడుస్తున్న విశాఖ-నిజాముద్దీన్‌(02887/02888) రైళ్లను జనవరి రెండవ తేదీ వరకు, విశాఖ-చెన్నై-విశాఖ (02869/02870) ఎక్స్‌ప్రెస్‌ రైళ్లను డిసెంబరు 29వ తేదీ వరకు, విశాఖ-ఎల్‌టీటీ-విశాఖ(02857/02858) ఎక్స్‌ప్రెస్‌లను డిసెంబరు 29 వరకు, విశాఖ-గాంధీథాం-విశాఖ(08501/08502) రైళ్లను జనవరి మూడో తేదీ వరకు, విశాఖ-కడప-విశాఖ(07488/07487) రైళ్లను జనవరి ఒకటి వరకు పొడిగించారు.


విశాఖ, విజయవాడ మధ్య ప్రత్యేక రైలు

రత్నాచల్‌ వేళల్లో అందుబాటు

విశాఖపట్నం, నవంబరు 30: విశాఖ, విజయవాడ మధ్య నడిచే రత్నాచల్‌ ఎక్స్‌ప్రెస్‌ మంగళవారం నుంచి ప్రత్యేక రైలుగా అందుబాటులోకి రానుంది. 02718 నంబరు గల ప్రత్యేక రైలు ప్రతిరోజు ఉదయం 6:15 గంటలకు విజయవాడలో బయలుదేరి అదేరోజు మధ్యాహ్నం 12:15 గంటలకు విశాఖ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో 02717 నంబరుతో మధ్యాహ్నం 12:55 గంటలకు విశాఖలో బయలుదేరి అదేరోజు రాత్రి 7:00 గంటలకు విజయవాడ చేరుతుంది. ఈ సర్వీసులు నూజివీడు, ఏలూరు, తాడేపల్లిగూడెం, నిడదవోలు, తుని మీదుగా రాకపోకలు సాగిస్తాయి. 


Updated Date - 2020-12-01T06:16:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising