ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సికింద్రాబాద్‌, తిరుపతి ప్రత్యేక రైళ్ల సర్వీసుల పొడిగింపు

ABN, First Publish Date - 2020-11-27T05:45:22+05:30

ప్రయాణికుల సౌకర్యార్థం విశాఖ, తిరుపతి, హైదరాబాద్‌, సికింద్రాబాద్‌ మధ్య నడుస్తున్న ప్రత్యేక రైళ్లను పొడిగించడంతోపాటు వేళలను సవరించినట్టు వాల్తేరు డివిజన్‌ సీనియర్‌ డీసీఎం ఏకే.త్రిపాఠి తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విశాఖపట్నం, నవంబరు 26: ప్రయాణికుల సౌకర్యార్థం విశాఖ, తిరుపతి, హైదరాబాద్‌, సికింద్రాబాద్‌ మధ్య నడుస్తున్న ప్రత్యేక రైళ్లను పొడిగించడంతోపాటు వేళలను సవరించినట్టు వాల్తేరు డివిజన్‌ సీనియర్‌ డీసీఎం ఏకే.త్రిపాఠి తెలిపారు. 


విశాఖ- హైదరాబాద్‌- విశాఖ

02727 నంబరు గల రైలు డిసెంబరు ఒకటి నుంచి రోజూ సాయంత్రం 5.20 గంటలకు విశాఖలో బయలుదేరి మర్నాడు ఉదయం 6.15 గంటలకు హైదరాబాద్‌ చేరుతుంది. తిరుగు ప్రయాణంలో 02728 నంబరు గల రైలు డిసెంబరు ఒకటి నుంచి రోజూ సాయంత్రం 5.05 గంటలకు హైదరాబాద్‌లో బయలుదేరి మర్నాడు ఉదయం 5.35 గంటలకు విశాఖ చేరుతుంది. 


సికింద్రాబాద్‌- విశాఖ- సికింద్రాబాద్‌

02784 నంబరు గల రైలు డిసెంబరు ఐదు నుంచి ప్రతి శనివారం రాత్రి 9.35 గంటలకు సికింద్రాబాద్‌లో బయలుదేరి మర్నాడు ఉదయం 9.50 గంటలకు విశాఖ చేరుతుంది. తిరుగు ప్రయాణంలో 02783 నంబరు గల రైలు డిసెంబరు ఆరు నుంచి ప్రతి ఆదివారం రాత్రి 7.05 గంటలకు విశాఖలో బయలుదేరి మర్నాడు ఉదయం 7.10 గంటలకు సికింద్రాబాద్‌ చేరుతుంది. 


తిరుపతి- విశాఖ- తిరుపతి

02708 నంబరు గల డబల్‌ డెక్కర్‌ రైలు డిసెంబరు రెండు నుంచి ప్రతి బుధ, శుక్ర, ఆదివారాల్లో రాత్రి 9.55 గంటలకు తిరుపతిలో బయలుదేరి మర్నాడు ఉదయం 10.30 గంటలకు విశాఖ చేరుతుంది. తిరుగు ప్రయాణంలో 02707 నంబరు గల రైలు డిసెంబరు మూడు నుంచి ప్రతి సోమ, గురు, శనివారాల్లో రాత్రి 11 గంటలకు విశాఖలో బయలుదేరి మర్నాడు మధ్యాహ్నం 12.45 గంటలకు తిరుపతి చేరుతుంది. 

Updated Date - 2020-11-27T05:45:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising