అప్పన్న దర్శనాల వేళల్లో స్వల్ప మార్పులు
ABN, First Publish Date - 2020-12-15T05:53:25+05:30
సింహాద్రి అప్పన్న స్వామి ఆలయంలో ఈనెల 16వ తేదీ ఉదయం 6.57 గంటలకు మోగే నెలగంటతో ధనుర్మాసోత్సవాలకు శ్రీకారం చుట్టనున్న నేపథ్యంలో ఆలయంలో జరిగే సేవలు, దర్శనాల వేళల్లో స్వల్ప మార్పులు చేసినట్టు ఏఈవో కేకే రాఘవకుమార్ తెలిపారు.
పలు ఆర్జిత సేవలు, నిత్య కల్యాణాలు రద్దు
సింహాచలం, డిసెంబరు 14: సింహాద్రి అప్పన్న స్వామి ఆలయంలో ఈనెల 16వ తేదీ ఉదయం 6.57 గంటలకు మోగే నెలగంటతో ధనుర్మాసోత్సవాలకు శ్రీకారం చుట్టనున్న నేపథ్యంలో ఆలయంలో జరిగే సేవలు, దర్శనాల వేళల్లో స్వల్ప మార్పులు చేసినట్టు ఏఈవో కేకే రాఘవకుమార్ తెలిపారు. మంగళవారం నుంచి 24వ తేదీ వరకు పగల్‌పత్తు ఉత్సవాలను నిర్వహించనున్నందున రోజూ వేకువజామున స్వామివారి తిరువీధి జరుగుందన్నారు. 25వ తేదీ నుంచి జనవరి మూడు వరకు రాపత్తు ఉత్సవాలను నిర్వహించనున్నందున ప్రతిరోజు సాయంత్రం ఐదు గంటలకు తిరువీధి జరుతుందన్నారు. రాపత్తు ఉత్సవ రోజుల్లో రాత్రి ఏడు గంటల వరకు మాత్రమే భక్తులకు స్వామివారి దర్శనాలు లభిస్తాయన్నారు. అలాగే జనవరి పది నుంచి 14 వరకు వార్షిక ధారోత్సవాలు జరగనున్నందున జనవరి పది నుంచి 15 వరకు స్వామివారి నిత్యకల్యాణాలు, తదితర ఆర్జిత సేవలను రద్దు చేసినట్టు పేర్కొన్నారు. జనవరి 13వ తేదీ సాయంత్రం ఐదు గంటలకు గోదారంగనాథుల కల్యాణోత్సవంతో పాటు ఆ రోజు ఉదయం జరగాల్సిన నిత్య కల్యాణాన్ని నిర్వహిస్తామని ఏఈవో తెలిపారు.
Updated Date - 2020-12-15T05:53:25+05:30 IST