ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఒకేరోజు ముగ్గురు చిన్నారులు మృతి

ABN, First Publish Date - 2020-06-11T09:22:46+05:30

మండలంలోని వేర్వేరు గ్రామాల్లో బుధవారం ముగ్గురు చిన్నారులు అనారోగ్యంతో మృతిచెందారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇద్దరు రెండేసి నెలల శిశువులు, ఒకరు ఏడేళ్ల బాలిక

ఒకరు జ్వరంతో, మరో ఇద్దరు శ్వాస సంబంధిత సమస్యలతో...


జి.మాడుగుల, జూన్‌ 10: మండలంలోని వేర్వేరు గ్రామాల్లో బుధవారం ముగ్గురు చిన్నారులు అనారోగ్యంతో మృతిచెందారు. వీరిలో ఇద్దరు రెండు నెలల శిశువులు కాగా, మరొకరు ఏడేళ్ల బాలిక. ఆయా గ్రామాల గిరిజనులు అందించిన సమాచారం మేరకు వివరాలిలా ఉన్నాయి. వంజరి పంచాయతీ పద్మాపురం గ్రామానికి చెందిన కొండపల్లి శ్రావ్య (7) వారం రోజుల నుంచి తీవ్ర జ్వరంతో బాధపడుతున్నది. స్థానికంగా వైద్య సేవలు అందించారు. అయితే బుఽధవారం జ్వర తీవ్రత పెరగడంతో బాలిక తండ్రి జగన్నాథం సమీపంలోని తాజంగి పీహెచ్‌సీకి తీసుకువెళ్లారు.


అక్కడ వైద్య సేవలు అందించినా పరిస్థితి మెరుగుపడకపోవడంతో నర్సీపట్నం ఆస్పత్రికి తీసుకువెళ్లారు. అక్కడ వైద్య సేవలు అందిస్తుండగా మృతిచెందింది. అలాగే కోరాపల్లి పంచాయతీ కుమ్మరిపుట్టు గ్రామానికి చెందిన వంతాల కొమ్లో, దేవి దంపతుల రెండు నెలల బాబు, కుంబిడిసింగి పంచాయతీ గద్దెరాయి గ్రామానికి చెందిన రామకృష్ణ, చంద్రమ్మ దంపతుల రెండు నెలల బాబు శ్వాస సంబంధ సమస్యతో అనారోగ్యానికి గురై మృతిచెందారు. 

Updated Date - 2020-06-11T09:22:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising