ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరోనా కట్టడికి దయాళ్‌నగర్‌లో ప్రత్యేక చర్యలు

ABN, First Publish Date - 2020-07-06T10:02:27+05:30

నగరంలో కరోనా వైరస్‌ విజృంభిస్తున్న క్రమంలో జీవీఎంసీ తొమ్మిదవ వార్డు పరిధిలోని దయాళ్‌నగర్‌ కాలనీ వాసులు ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కాలనీ ప్రవేశ మార్గంలో థర్మల్‌ స్ర్కీనింగ్‌

ఇతరుల రాకపోకలపై ఆంక్షలు


విశాలాక్షినగర్‌, జూలై 5 : నగరంలో కరోనా వైరస్‌ విజృంభిస్తున్న క్రమంలో జీవీఎంసీ తొమ్మిదవ వార్డు పరిధిలోని దయాళ్‌నగర్‌ కాలనీ వాసులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే అప్పూఘర్‌ ప్రాంతంలోని ఫిషర్‌మెన్‌ కాలనీ కాంటాక్ట్‌లతో దయాళ్‌నగర్‌ పక్కనే ఉన్న జోడుగుళ్లపాలెంలో 10 కేసులు ఉండటంతో దయాల్‌నగర్‌ వాసులు అప్రమత్తమయ్యారు.


ఈ ప్రాంతంలో దయాళ్‌నగర్‌ అంటే ప్రత్యేకమైన పేరు ఉంది. పరిశుభ్రత, ఆధ్యాత్మిక భావనలో కాలనీ వాసులు ఉంటారు. దీంతో దయాళ్‌నగర్‌లోకి ప్రవేశించే అన్ని మార్గాలను మూసివేశారు. అలాగే కాలనీలోకి ప్రవేశించే మార్గంలో ఽథర్మల్‌ స్ర్కీనింగ్‌ చేయడంతో పాటు శానిటైజర్లు విధిగా రాసుకుంటేనే ప్రవేశానికి అనుమతిస్తున్నారు. కాలనీలోకి ప్రవేశించే వారి వ్యక్తిగత సమాచారాన్ని పుస్తకంలో నమోదు చేస్తున్నారు. కాలనీలో సుమారు రెండు వందల ఇళ్ల వరకు ఉన్నాయి. వీరిలో  ప్రవేశ మార్గం వద్ద నలుగురు ఉండేటట్టు ఏర్పాటు చేసుకుని, కరోనా వైరస్‌ కట్టడికి తమవంతు ప్రయత్నం చేస్తున్నారు. 

Updated Date - 2020-07-06T10:02:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising