ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రాంబిల్లిలో ఫార్మా క్లస్టర్‌

ABN, First Publish Date - 2020-06-18T09:37:23+05:30

విశాఖపట్నంలో అనేక అభివృద్ధి పనులకు ప్రతిపాదనలు రూపొందించినట్టు రాష్ట్ర ప్రణాళిక విభాగం వెల్లడించింది. 2019-20 ఆర్థిక

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కేంద్రానికి రాష్ట్ర ప్రణాళిక విభాగం ప్రతిపాదన

రూ.2,302 కోట్లతో భోగాపురం విమానాశ్రయం

త్వరలో మెడ్‌టెక్‌ పార్క్‌ రెండో దశ పనులు

ట్రాన్స్‌పోర్టు వాహనాల ఫిట్‌నెస్‌ పరీక్షల కోసం రూ.16.5 కోట్లతో ఐ అండ్‌ సీసీ ఏర్పాటు

రూ.9.5 కోట్లతో ముడసర్లోవ రిజర్వాయర్‌ అభివృద్ధి

రూ.14.5 కోట్లతో 3 మెగావాట్ల సోలార్‌ పవర్‌ ప్లాంట్లు

నక్కపల్లి, రాంబిల్లిలలో స్టార్టప్‌ ఏరియాల అభివృద్ధి

2019-20 ఆర్థిక సర్వే నివేదికలో వెల్లడి


(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి): విశాఖపట్నంలో అనేక అభివృద్ధి పనులకు ప్రతిపాదనలు రూపొందించినట్టు రాష్ట్ర ప్రణాళిక విభాగం వెల్లడించింది. 2019-20 ఆర్థిక సంవత్సరానికి నిర్వహించిన సాంఘిక, ఆర్థిక సర్వే నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. అందులో విశాఖ జిల్లాకు సంబంధించి పలు అంశాలను పొందుపరిచింది. 


విశాఖపట్నంలోని గంగవరం పోర్టులో రాష్ట్ర ప్రభుత్వానికి 10.39 శాతం వాటా వుందని పేర్కొంది. ఆ పోర్టు 2019-20 ఆర్థిక సంవత్సరంలో 34.45 మిలియన్‌ టన్నుల కార్గోను హ్యాండిల్‌ చేసి రూ.1,102.18 కోట్లు ఆదాయం సాధించగా అందులో ప్రభుత్వానికి రూ.23.14 కోట్లు వచ్చిందని వివరించింది.

భోగాపురంలో నిర్మించనున్న గ్రీన్‌ఫీల్డ్‌ అంతర్జాతీయ విమానాశ్రయం కోసం భూ సేకరణ కోసం ఇప్పటివరకు రూ.732 కోట్లు వెచ్చించారు. రూ.2,302 కోట్లతో విమానాశ్రయం నిర్మిస్తారు. మొదటి దశలో 60 లక్షల మంది ప్రయాణికులకు సరిపోయేలా, రెండో దశలో 1.2 కోట్ల మందికి సరిపోయేలా నిర్మిస్తారు.

విశాఖపట్నంలో బుద్ధిస్ట్‌ టూరిజం సర్క్యూట్‌తో పాటు అరకు ఎకో టూరిజం, కోస్టల్‌ టూరిజం, టెంపుల్‌ టూరిజం, రూరల్‌ టూరిజం కోసం ప్రణాళికలు రూపొందించారు.

జీసీసీ 2019-20 ఆర్థిక సంవత్సరంలో రూ.13.18 కోట్ల అటవీ ఉత్పత్తులను గిరిజనుల నుంచి సేకరించింది. రూ.1.21 కోట్ల విలువైన కాఫీని తీసుకుంది. రూ.326.61 కోట్ల విలువైన నిత్యవసర సరకులు గిరిజనులకు పంపిణీ చేసింది. అదనపు విలువలు జోడించిన రూ.23.3 కోట్ల ఉత్పత్తులను విక్రయించింది. 

విశాఖపట్నం-చెన్నై పారిశ్రామిక కారిడార్‌లో లక్ష కోట్ల రూపాయల పెట్టుబడులు వస్తాయని, 110 లక్షల మందికి ఉపాధి లభిస్తుందని అంచనా వేశారు. ఇందులో గ్రీన్‌ఫీల్డ్‌ అప్రోచ్‌ రోడ్డు, నీటి సరఫరా కోసం నక్కపల్లిలో రూ.85 కోట్లతో పనులు చేపడతారు. విశాఖ జిల్లా క్లస్టర్‌లో కనీసం 25 వేల మంది మహిళలకు ఉపాధి శిక్షణ ఇస్తారు.

కాపులుప్పాడ, నక్కపల్లి, చందనాడ (అచ్యుతాపురం)ల్లో ఏపీ ట్రాన్స్‌కో విద్యుత్‌ పనుల కోసం రూ.327 కోట్లు వెచ్చిస్తుంది.

ముడసర్లోవ రిజర్వాయర్‌లో నీటి నిల్వల అభివృద్ధి కోసం రూ.9.5 కోట్లు వెచ్చిస్తారు.

ముడసర్లోవ, మేహాద్రిగెడ్డ రిజర్వాయర్‌లపై మరో 3 మెగావాట్ల సోలార్‌ పవర్‌ ప్లాంట్ల కోసం రూ.14.5 కోట్లు కేటాయించారు.

రాంబిల్లి మండలంలో ఫార్మా క్లస్టర్‌ ఏర్పాటు కోసం కేంద్ర మంత్రిత్వ శాఖకు ప్రతిపాదనలు సమర్పించారు. 

అగనంపూడిలోని మెడ్‌టెక్‌ జోన్‌లో రెండో దశ అభివృద్ధి పనులు చేపడతారు.

నక్కపల్లి, రాంబిల్లిలలో స్టార్టప్‌ ఏరియాలను అభివృద్ధి చేస్తారు.

ట్రాన్స్‌పోర్టు వాహనాల ఫిట్‌నెస్‌ పరీక్షల కోసం రవాణా శాఖ ఆటోమెటెడ్‌ ఇన్‌స్పెక్షన్‌ అండ్‌ సర్టిఫికేషన్‌ సెంటర్‌ (ఐ అండ్‌ సీసీ)ను రూ.16.5 కోట్లతో ఏర్పాటుచేస్తోంది.


జిల్లా సమాచారం

జిల్లాలో సెల్‌ఫోన్లు - 8,42,642

ల్యాండ్‌ లైన్‌ ఫోన్లు - 62,360

బ్యాంకుల సంఖ్య - 784

డిపాజిట్లు - రూ.39,966.48 కోట్లు

రుణాలు - రూ.72,120 కోట్లు

పురుషుల అక్షరాస్యత శాతం 74.56

మహిళల అక్షరాస్యత శాతం 59.91

జిల్లా సగటు అక్షరాస్యత శాతం 66.91

జిల్లాలో వ్యవసాయం 3.06 లక్షల ఎకరాలు

గనుల ద్వారా ఆదాయం  రూ.10,942 కోట్లు

సెజ్‌ల సంఖ్య - 7

ఉద్యోగులు - 42,767

ఎగుమతులు - 11,875 కోట్లు

పెట్టుబడులు - 12,620.31 కోట్లు

జిల్లాలో 2014-2019 వరకు ఏర్పాటైన భారీ పరిశ్రమలు 40

వచ్చిన పెట్టుబడులు  రూ.14,694.16 కోట్లు 

లభించిన ఉపాధి - 21,717

2019-20లో వచ్చిన పెట్టుబడులు 434.87 కోట్లు 

లభించిన ఉపాధి - 481

సముద్ర ఉత్పత్తుల ఎగుమతులు - 1,21,286 టన్నులు

చెరువు చేపల ఎగుమతులు - 37,743 టన్నులు


Updated Date - 2020-06-18T09:37:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising