యాసిడ్ దాడి బాధితురాలికి న్యాయం చేయాలి
ABN, First Publish Date - 2020-12-29T05:38:55+05:30
భర్త చేతిలో యాసిడ్ దాడికి గురై అవస్థలు పడుతున్న జోగ అపర్ణకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ దళిత సంఘాల ఆధ్వర్యంలో సోమవారం పెందుర్తి అంబేడ్కర్ విగ్రహం వద్ద రిలే దీక్ష శిబిరాన్ని నిర్వహించారు.
పెందుర్తి, డిసెంబరు 28: భర్త చేతిలో యాసిడ్ దాడికి గురై అవస్థలు పడుతున్న జోగ అపర్ణకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ దళిత సంఘాల ఆధ్వర్యంలో సోమవారం పెందుర్తి అంబేడ్కర్ విగ్రహం వద్ద రిలే దీక్ష శిబిరాన్ని నిర్వహించారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో పెందుర్తిలో ఈ సంఘటన జరిగింది. దీక్షకు బీఎస్సీ, బీజేపీ, సీపీఎం, కాంగ్రెస్ నాయకులు బోను కృష్ణ, గొర్లె రామునాయుడు, జి.అప్పలరాజు, షేక్ షఫీఉల్లా సంఘీభావం తెలిపారు. బాధితురాలికి మెరుగైన వైద్యం అందేలా ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని, ఆమె అత్తింటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
Updated Date - 2020-12-29T05:38:55+05:30 IST