ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

టీడీపీ పార్లమెంటరీ కమిటీలు రెడీ.. విశాఖ అధ్యక్షునిగా...

ABN, First Publish Date - 2020-09-26T17:24:37+05:30

పార్లమెంటరీ నియోజకవర్గ కేంద్రంగా ఏర్పాటుచేయబోయే కమిటీలకు ఈనెల 27వ తేదీన అధ్యక్షులను ప్రకటించాలని తెలుగుదేశం అధిష్ఠానం నిర్ణయించింది. విశాఖ జిల్లాలో మూడు పార్లమెంటరీ నియోజకవర్గ కమిటీలకు అధ్యక్షుల ఎంపిక దాదాపు పూర్తయినట్టు తెలిసింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విశాఖ అధ్యక్షునిగా పల్లా?

అనకాపల్లికి బుద్ధ నాగజగదీశ్వరరావు

అరకులోయకు గుమ్మడి సంధ్యారాణి

రేపు ప్రకటించే అవకాశం

తమ ప్రయత్నాలు కొనసాగిస్తున్న ఆశావహులు


(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి): పార్లమెంటరీ నియోజకవర్గ కేంద్రంగా ఏర్పాటుచేయబోయే కమిటీలకు ఈనెల 27వ తేదీన అధ్యక్షులను ప్రకటించాలని తెలుగుదేశం అధిష్ఠానం నిర్ణయించింది. విశాఖ జిల్లాలో మూడు పార్లమెంటరీ నియోజకవర్గ కమిటీలకు అధ్యక్షుల ఎంపిక దాదాపు పూర్తయినట్టు తెలిసింది. అయినప్పటికీ పలువురు నేతలు తమ వంతు ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. విశాఖ పార్లమెంటరీ నియోజక వర్గానికి గాజువాక మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు పేరు ఖరారు చేసినట్టు చెబుతున్నారు. ప్రధాన కార్యదర్శిగా పట్టాభి పేరు వినిపిస్తోంది. అయితే ఎమ్మెల్యేలు/మాజీ ఎమ్మెల్యేలకే కాకుండా ద్వితీయ శ్రేణి నాయకులకు కూడా అవకాశం ఇవ్వాలనే వాదన తాజాగా తెరపైకి వచ్చింది. ఈ నేపథ్యంలో కాకి గోవిందరెడ్డి, పట్టాభి తదితరుల పేర్లు పరిశీలనకు వచ్చే అవకాశం వుందని చెబుతున్నారు. 


అనకాపల్లి పార్లమెంటరీ నియోజకవర్గానికి ఎమ్మెల్సీ బుద్ద నాగజగదీశ్వరరావు పేరు ఖరారు చేసినట్టు పార్టీ కేంద్ర కార్యాలయ వర్గాల సమాచారం. అయితే అనకాపల్లి పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలో వెలమ సామాజిక వర్గం కీలకమైనందున ఆ వర్గం వారికి అవకాశం ఇవ్వాలనే డిమాండ్‌ వినిపిస్తోంది.ఇక అరకు పార్లమెంటరీ కమిటీ అధ్యక్ష పదవికి మాజీ ఎమ్మెల్సీ గుమ్మడి సంధ్యారాణి పేరు దాదాపు ఖరారైనట్టు తెలిసింది.

Updated Date - 2020-09-26T17:24:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising