ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గిరిజన రైతులను ప్రభుత్వం పట్టించుకోవడం లేదు

ABN, First Publish Date - 2020-12-31T05:27:57+05:30

నివర్‌ తుఫాన్‌ వల్ల పంటలు నష్టపోయిన గిరిజన ప్రాంత రైతులను రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మాజీ మంత్రి కిడారి శ్రావణ్‌కుమార్‌ ఆరోపించారు.

ముసిడిపుట్టులో రైతులతో మాట్లాడుతున్న శ్రావణ్‌కుమార్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మాజీ మంత్రి కిడారి శ్రావణ్‌కుమార్‌ 


పెదబయలు, డిసెంబరు 30: నివర్‌ తుఫాన్‌ వల్ల పంటలు నష్టపోయిన గిరిజన ప్రాంత రైతులను రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మాజీ మంత్రి కిడారి శ్రావణ్‌కుమార్‌ ఆరోపించారు. బుధవారం మండలంలో పర్యటించిన ఆయన సీతగుంట పంచాయతీ ముసిడిపుట్టులో వరి నూర్చుతున్న రైతులతో మాట్లాడారు. గత నెలలో భారీ వర్షాలు, వరద వల్ల వరి, రాగి, జొన్న, తదతర పంటలు కోల్పోయిన  గిరిజన రైతులకు పూర్తిస్థాయిలో నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్‌ చేశారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే సివేరి సోమ జయంతిని పురస్కరించుకుని మాజీ సర్పంచ్‌ టి.త్రినాథ్‌ ఇంటి వద్ద సోమ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఆయన వెంట టీడీపీ మండల అధ్యక్షురాలు సీకరి సుకుమారి, నాయకులు బాకూరు వెంకటరమణరాజు పాండురంగస్వామి, చిన్ని, మహేశ్వరి, కూడ భూషణరావు, బాలంనాయుడు, బాలన్న, రాజారావు, తదితరులు వున్నారు.


తుఫాన్‌ బాధిత రైతులకు పూర్తినష్టపరిహారం ఇవ్వాలి: గిడ్డి ఈశ్వరి

పాడేరు, డిసెంబరు 30: నివర్‌ తుఫాన్‌ వల్ల పంటలు నష్టపోయిన రైతులను ఆదుకోవాలని మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి డిమాండ్‌ చేస్తూ తహసీల్దార్‌ కార్యాలయం వద్ద ఆందోళన చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.... పంటలు దెబ్బతిన్న రైతులకు మొక్కుబడిగా కాకుండా పూర్తిస్థాయిలో పరిహారం  అందజేయాలన్నారు. అనంతరం రెవెన్యూ అధికారులకు వినతిపత్రం అందజేశారు. టీడీపీ నేతలు కిల్లు వెంకటరత్నం, రొబ్బి రాము, కేవీసురేశ్‌కుమార్‌, రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2020-12-31T05:27:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising