జగన్ పాలనలో అభివృద్ధికి తిలోదకాలు
ABN, First Publish Date - 2020-11-04T03:02:11+05:30
పోలవరం, అమరావతి నిర్మాణం వంటి అబివృద్ధి పనులకు స్వస్తి చెప్పిన జగన్ సర్కారు కేవలం ఇసుక, గ్రావెల్ మాఫియా, భూ ఆక్రమణలతో రాష్ట్ర భవిష్యత్తును అగమ్యగోచరం చేసిందని మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తి అన్నారు.
మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి
టీడీపీ విశాఖ పార్లమెంట్ కమిటీ అధ్యక్షుడు ‘పల్లా’కు ఘన సత్కారం
అక్కిరెడ్డిపాలెం, నవంబరు 3: పోలవరం, అమరావతి నిర్మాణం వంటి అబివృద్ధి పనులకు స్వస్తి చెప్పిన జగన్ సర్కారు కేవలం ఇసుక, గ్రావెల్ మాఫియా, భూ ఆక్రమణలతో రాష్ట్ర భవిష్యత్తును అగమ్యగోచరం చేసిందని మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తి అన్నారు. రాష్ట్ర ఎంబీసీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ కాకి గోవిందరెడ్డి ఆధ్వర్యంలో నాతయ్యపాలెంలో మంగళవారం టీడీపీ విశాఖ పార్లమెంట్ కమిటీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావును ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన బండారు మాట్లాడుతూ తప్పుచేసిన నాయకులు జైలుకి వెళితే పరివర్తనతో తిరిగి బయటకు వస్తారని, కాని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మాత్రం జైలులో వున్నప్పుడు టీడీపీ నాయకులు ఎవరిపై ఎలా పగ సాధించాలి అని ప్రణాళికలు రూపొందించుకొని బయటకువచ్చి అమలుచేస్తున్నారని ఆరోపించారు. తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు మాట్లాడుతూ స్వార్థంతో కొందరు పార్టీని విడిచిపెట్టినా, బలమైన కార్యకర్తలు వున్నంతవరకు టీడీపీని ఏ ప్రభుత్వం ఏమీ చేయలేదన్నారు. పార్టీ నాయకుడు శ్రీభరత్ మాట్లాడుతూ కార్యకర్తలు ఐక్యంగా మెలగి, ప్రజా సమస్యలపై పోరాడాలని పిలుపునిచ్చారు. టీడీపీ విశాఖ పార్లమెంట్ కమిటీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా కార్యకర్తలు, నాయకులు పనిచేయాలన్నారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు తనపై నమ్మకంతో వుంచిన బాధ్యతను సక్రమంగా నెరవేరుస్తానని అన్నారు. కార్యకర్తల అండతో విశాఖలో టీడీపీకి పూర్వ వైభవం రప్పిస్తానన్నారు. మాజీ కార్పొరేటర్‌లు గంధం శ్రీనివాస్, పల్లా శ్రీనివాస్, ప్రసాదుల శ్రీనివాస్, పుచ్చా విజయ్‌కుమార్, తెలుగు మహిళ విశాఖ పార్లమెంట్ కమిటీ అధ్యక్షురాలు సర్వసిద్ధి అనంతలక్ష్మి, గోపిశెట్టి గోపి, అక్కిరెడ్డి శ్రీను, అలమండ రాజు, శీరం రాజేష్, ఎన్.మధులత, జి.కల్యాణ్, లక్ష్మి లావణ్య, ప్రకాశ్ తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2020-11-04T03:02:11+05:30 IST