రైతుబజారులో ఆకస్మిక తనిఖీలు
ABN, First Publish Date - 2020-11-18T04:22:45+05:30
స్థానిక రైతుబజారును మార్కెటింగ్ శాఖ ఏడీఎం కాళేశ్వరరావు మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.
రైతుల వివరాలు తెలుసుకుంటున్న ఏడీఎం కాళేశ్వరరావు
కంచరపాలెం, నవంబరు 17: స్థానిక రైతుబజారును మార్కెటింగ్ శాఖ ఏడీఎం కాళేశ్వరరావు మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. రైతుల సమస్యలను తెలుసుకున్నారు. గుర్తింపు కార్డులుతోనే బజారులోకి ప్రవేశించాలని, ఎలక్ర్టానిక్ తూనిక కాటాలను వినియోగించాలని సూచించారు. బజారులో రైతుల సమస్యలపై చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో ఎస్టేట్ అధికారి వైవీఎం కృష్ణయాదవ్, సాంబశివ తదితరలు పాల్గొన్నారు.
Updated Date - 2020-11-18T04:22:45+05:30 IST