ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అద్భుతమైన కథ మా ‘1978 పలాస’ : తమ్మారెడ్డి

ABN, First Publish Date - 2020-02-24T09:35:22+05:30

‘కింది స్థాయి వ్యక్తులు డబ్బుకు లొంగరు’ అనే కాన్సెప్ట్‌తో తీసిన ఈ చిత్రంలో అద్భుత మైన కథ ఉందని, అన్నదమ్ముల మధ్య మంచి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

దొండపర్తి, ఫిబ్రవరి 22: ‘కింది స్థాయి వ్యక్తులు డబ్బుకు లొంగరు’ అనే కాన్సెప్ట్‌తో తీసిన ఈ చిత్రంలో అద్భుత మైన కథ ఉందని, అన్నదమ్ముల మధ్య మంచి సెంటిమెంట్‌ ఉందని, చదువుకోవడం ఎంత మంచిదో తెలియజేసే చిత్రమే ‘1978 పలాస’ అని దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ  పేర్కొన్నారు. ఆదివారం నగరంలోని ఒక హోటల్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ శ్రీకాకుళం యాసలో ఈ చిత్ర నటీనటులు మాట్లాడిన తీరు చాలా బాగుందన్నారు.


చుండూరు వంటి ఘటనలు నేటికీ ప్రతి ఊరిలో జరుగుతున్నాయని తెలియజేసేదే ఈ సినిమా కథాంశమన్నారు. కాన్సెప్ట్‌ నచ్చడంతో ఈ చిత్రానికి తాను సమర్పకునిగా వ్యవహరిస్తున్నట్టు భరద్వాజ  తెలిపారు. దర్శకుడు కరుణ్‌కుమార్‌ మాట్లాడుతూ ప్రతి ఊరు కథ ఈ చిత్రమన్నారు. మ్యూజిక్‌ డైరెక్టర్‌ రఘు కుంచె మాట్లాడుతూ ఈ చిత్రానికి సంగీతం అందించడంతో పాటు తొలిసారిగా పూర్తి నిడివి గల పాత్ర చేశానన్నారు. ఇంకా సమావేశంలో ‘జబర్దస్త్‌’ ఫేమ్‌ త్రినాఽథ్‌, నిర్మాత ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2020-02-24T09:35:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising