ఫ్యాన్‌కు ఉరి వేసుకుని వ్యక్తి ఆత్మహత్య
ABN, First Publish Date - 2020-11-13T06:00:06+05:30
ఆర్థిక ఇబ్బందులకు తాళలేక ఆరిలోవలోని శ్రీకాంత్‌నగర్‌లో వెంకటరాజు (32) అనే వ్యక్తి ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్టు ఆరిలోవ ఎస్‌ఐ కె.శ్రీనివాసరావు తెలిపారు.
ఆరిలోవ, నవంబరు 12: ఆర్థిక ఇబ్బందులకు తాళలేక ఆరిలోవలోని శ్రీకాంత్‌నగర్‌లో వెంకటరాజు (32) అనే వ్యక్తి ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్టు ఆరిలోవ ఎస్‌ఐ కె.శ్రీనివాసరావు తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం శ్రీకాంత్‌నగర్‌లో కుటుంబంతో ఉంటున్న వెంకట రాజు క్యాబ్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. కరోనా నేపథ్యంలో సరిగ్గా బేరాలు లేక ఆర్థికంగా ఇబ్బందులు తలెత్తడంతో మానసిక ఆందోళనకు గురై గురువారం వేకువజామున ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్టు ఆయన భార్య నాగలక్ష్మి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ పేర్కొన్నారు.
Updated Date - 2020-11-13T06:00:06+05:30 IST