ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వైసీపీ మండల అధ్యక్షుడిపై అట్రాసిటీ కేసు

ABN, First Publish Date - 2020-12-04T05:49:25+05:30

దళిత మహిళ ఫిర్యాదు మేరకు వైసీపీ మండల అధ్యక్షుడు గొర్లి సూరిబాబుపై రూరల్‌ పోలీసులు అట్రాసిటీ కేసు నమోదు చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అనకాపల్లి టౌన్‌, డిసెంబరు 3: దళిత మహిళ ఫిర్యాదు మేరకు వైసీపీ మండల అధ్యక్షుడు గొర్లి సూరిబాబుపై రూరల్‌ పోలీసులు అట్రాసిటీ కేసు నమోదు చేశారు. ఆలస్యంగా తెలిసిన ఈ కేసుకు సంబంధించి రూరల్‌ సీఐ పీవీవీ నరసింహారావు అందించిన వివరాలిలా ఉన్నాయి. మండలంలోని గొలగాం గ్రామానికి చెందిన దళితురాలు గంట్ల లక్ష్మి సర్వే నంబరు 88లో రేకులషెడ్డు వేసుకుని నివాసం ఉంటుంది. ఇంటి మరమ్మతు పనులు చేస్తుండగా అదే గ్రామానికి చెందిన దేముడు వచ్చి అభ్యంతరం తెలిపారు. పార్టీ మండల అధ్యక్షుడు గొర్లి సూరిబాబును కలిసిన తర్వాతే ఇంటి పనులు చేసుకోవాలని స్పష్టం చేశాడు. తన ఇంటి పని తాను చేసుకుంటానని చెప్పడంతో నవంబరు 23వ తేదీన వైసీపీ మండల అధ్యక్షుడు తన అనుచరులను పంపించి దౌర్జన్యం చేసి భయబ్రాంతులకు గురి చేశారని, వారి నుంచి తనకు రక్షణ కల్పించాలని లక్ష్మి పోలీసులను కకోరారు. గత నెల 28న ఆమె ఇచ్చిన ఫిర్యాదు మేరకు వైసీపీ మండల అధ్యక్షుడు సూరిబాబుపై పోలీసులు అట్రాసిటీ కేసు నమోదు చేశారు. ఈ కేసును డీఎస్పీ దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ తెలిపారు. 


Updated Date - 2020-12-04T05:49:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising