ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గిరిజనుల్ని ఇబ్బంది పెట్టడం సీఎంకు తగదు

ABN, First Publish Date - 2020-10-24T10:35:52+05:30

అమాయకులైన గిరిజనుల్ని ఇబ్బంది పెట్టడడం ముఖ్యమంత్రి జగన్‌కు తగదని తెలుగుదేశం పార్టీ అరకు పార్లమెంట్‌ అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ గుమ్మడి సంధ్యారాణి అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

టీడీపీ అరకు పార్లమెంట్‌ అధ్యక్షురాలు గుమ్మడి సంధ్యారాణి 

గిరిజనుల సమస్యలు పరిష్కరించాలని ఐటీడీఏ వద్ద ధర్నా 


పాడేరు, అక్టోబరు 23: అమాయకులైన గిరిజనుల్ని ఇబ్బంది పెట్టడడం ముఖ్యమంత్రి జగన్‌కు తగదని తెలుగుదేశం పార్టీ అరకు పార్లమెంట్‌ అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ గుమ్మడి సంధ్యారాణి అన్నారు. మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి, మాజీ మంత్రి కిడారి శ్రావణ్‌కుమార్‌ ఆధ్వర్యంలో గిరిజన సమస్యలపై శుక్రవారం ఐటీడీఏ కార్యాలయం వద్ద నిర్వహించిన ధర్నాలో ఆమె పాల్గొని మాట్లాడారు.  వైసీపీని గిరిజనులు ఆదరించి ఎంపీ, ఏడు ఎమ్మెల్యేలను ఇచ్చినందుకు జగన్‌ ప్రభుత్వం వారికి మేలు చేయకపోగా, ఇబ్బందులకు గురి చేస్తున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. వెనుకబాటుకు గురైన గిరిజనులకు నాణ్యమైన విద్యను అందించే బెస్ట్‌ అవైలబుల్‌ స్కూల్‌ పథకాన్ని రద్దు చేయడం ఎంత వరకు న్యాయమని సంధ్యారాణి ప్రశ్నించారు.


ట్రైకార్‌ రాయితీ రుణాల మంజూరును వైసీపీ ప్రభుత్వం విస్మరించిందన్నారు. జగన్‌ ప్రభుత్వంలో అన్ని రద్దులే తప్ప అభివృద్ధి, సంక్షేమం మాటే లేదని ఎద్దేవా చేశారు. జీవో-3ని సుప్రీంకోర్టు రద్దు చేసిన నేపథ్యంలో దానిపై రివ్యూ పిటిషన్‌ దాఖలు చేయాల్సి వైసీపీ ప్రభుత్వం కనీసం పట్టించుకోకపోవడం చూస్తుంటే.. గిరిజనులపై వారికున్న ప్రేమ ఏపాటితో అర్థమవుతుందన్నారు. మాజీ మంత్రి కిడారి శ్రావణ్‌కుమార్‌, మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి మాట్లాడుతూ.. గిరిజనులకు తెలుగుదేశం పార్టీ అనేక పథకాలు పెట్టిందని, వైసీపీ ప్రభుత్వం ఆ పథకాలన్నీ తీసేస్తూ గిరిజనులు అభివృద్ధి చెందకుండా చేస్తుందని ఆరోపించారు.


జీవో-3 పునరుద్ధరణకు చర్యలు చేపట్టాలని, బెస్ట్‌ అవైలబుల్‌ స్కూల్‌ పథకాన్ని కొనసాగించాలని, ట్రైకార్‌ రాయితీ రుణాలు గిరిజనులకు అందించాలని వారు డిమాండ్‌ చేశారు. అనంతరం తమ డిమాండ్‌లపై ఐటీడీఏ ఏపీవో వీఎస్‌.ప్రభాకరరావుకు వినతిపత్రాన్ని సమర్పించారు. ఈ ఆందోళనలో టీడీపీ అరకు పార్లమెంట్‌ ప్రధాన కార్యదర్శి గబ్బాడ శాంతికుమారి, టీడీపీ నేతలు పి.గోవిందరావు, బొర్రా నాగరాజు, బాకూరు వెంకటరమణ, దొన్నుదొర, అప్పాలు, పాండురంగస్వామి, చల్లంగి లక్ష్మణరావు, జ్ఞానేశ్వరి, గంగపూజారి శివకుమార్‌, సుబ్బలక్ష్మి, కె.పద్మ, సుబ్బారావు, జ్యోతికిరణ్‌, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-10-24T10:35:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising