ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అన్నదాతకు కడగండ్లు

ABN, First Publish Date - 2020-12-04T05:48:25+05:30

అన్నదాతను ఏదో విధంగా కష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి. అనావృష్టి.. అతివృష్టికి తోడు తాజాగా కాలువ గండ్లు కలవరపరుస్తున్నాయి.

ఏలేరు కాలువ గట్టుకు పడిన గండి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

భయపెడుతున్న ఏలేరు కాలువ గండ్లు

వందలాది ఎకరాలకు పొంచివున్న ముప్పు

ఆందోళనలో తుమ్మపాల రైతులు


అనకాపల్లి, డిసెంబరు 3: అన్నదాతను ఏదో విధంగా కష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి. అనావృష్టి.. అతివృష్టికి తోడు తాజాగా కాలువ గండ్లు కలవరపరుస్తున్నాయి. కాలువలో నీరు నిండుగా ఉండడంతో ప్రవాహానికి గండ్లు పెద్దవైతే వందలాది ఎకరాలు గంగ పాలవుతాయనే భయాందోళనలు వారిని  నిద్రకు దూరం చేస్తున్నాయి. 


జీవీఎంసీకి నీటిని సరఫరా చేస్తున్న ఏలేరు కాలువ తుమ్మపాల గ్రామం మధ్య నుంచి వెళ్తోంది. కాలువను ఆనుకుని వందలాది ఎకరాల పంట భూములు ఉన్నాయి. ఇప్పటికే పంట కోత దశకు వచ్చింది. ఈ నేపథ్యంలో బొజ్జన్నకొండ సమీపంలో ఏలేరు కాలువకు రెండు చోట్ల గండ్లు పడ్డాయి. తుఫాన్‌ ప్రభావంతో కురిసిన భారీ వర్షాలకు ఏలేరు కాలువ నిండుగా ప్రవహిస్తోంది. దీంతో గండ్లు పెద్దవైతే ప్రవాహం పెరిగి పంట పొలాలకు ముప్పు వాటిల్లుతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ సమస్యను ఏలేరు కాలువ పర్యవేక్షణ సిబ్బందికి ఎన్నిమార్లు తెలిపినా కనీసం పట్టించుకోవడం లేదని వారు వాపోయారు. మరో తుఫాన్‌ వస్తే తమ పరిస్థితి ఏమిటని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు, ప్రజా ప్రతినిధులు స్పందించి గండ్లు పూడ్చాలని రైతులు కోరుతున్నారు. 

Updated Date - 2020-12-04T05:48:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising