కొవిడ్ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు
ABN, First Publish Date - 2020-11-03T05:34:34+05:30
బస్సులు, ఆటోల్లో ప్రయాణికులను, విద్యార్థులను తరలించేటపుడు కొవిడ్ నిబంధనలను పాటించకపోతే కఠిన చర్యలు తప్పవని రవాణా శాఖ ఉప కమిషనర్ రాజారత్నం హెచ్చరించారు.
బస్సుల్లో తనిఖీలు చేస్తున్న అధికారులు
విశాఖపట్నం, నవంబరు 2 (ఆంధ్రజ్యోతి): బస్సులు, ఆటోల్లో ప్రయాణికులను, విద్యార్థులను తరలించేటపుడు కొవిడ్ నిబంధనలను పాటించకపోతే కఠిన చర్యలు తప్పవని రవాణా శాఖ ఉప కమిషనర్ రాజారత్నం హెచ్చరించారు. ఆనందపురం, మద్దిలపాలెం, ఇసుకతోట, ఎండాడ, ఎన్‌ఏడీ కూడలి, నర్సీపట్నం తదితర ప్రాంతాల్లో బస్సులు, ఆటోలను సోమవారం రవాణాశాఖ ప్రత్యేక బృందాలు తనిఖీలు నిర్వహించాయన్నారు. మాస్కు లేనివారిని వాహనాల్లోకి అనుమతించవద్దని డ్రైవర్లకు స్పష్టంచేశారు.
Updated Date - 2020-11-03T05:34:34+05:30 IST