ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విశాఖలో రౌడీ షీటర్ బర్త్ డే సెలబ్రేషన్స్.. రంగంలోకి పోలీసులు

ABN, First Publish Date - 2020-07-17T00:01:54+05:30

విశాఖపట్నం : జిల్లాలోని అనకాపల్లి మామిడి పాలెం శివారు సరుగుడు తోటల్లో ఓ పేరు మోసిన రౌడీషీటర్ బర్త్ డే సెలబ్రేషన్స్ జరిగాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విశాఖపట్నం : జిల్లాలోని అనకాపల్లి మామిడి పాలెం శివారు సరుగుడు తోటల్లో ఓ పేరు మోసిన రౌడీషీటర్ బర్త్ డే సెలబ్రేషన్స్ జరిగాయి. ఈ కార్యక్రమానికి సుమారు చోటా మోటా రౌడీ షీటర్లు 30 మంది దాకా హాజరయ్యారు. గ్రామ శివార్లలోని తోటల్లో మద్యంతో విందు వినోదాలతో రౌడీ షీటర్లు చెలరేగారు. జిల్లా ఎస్పీ కృష్ణారావుకు సమాచారం రావడంతో పోలీసులు రంగంలోకి దిగారు. అయితే పోలీసులు వస్తున్నారని ముందే పసిగట్టిన రౌడీ షీటర్లు తోటల్లో నుంచి పరారయ్యారు. అయితే.. పోలీసులు నుంచే ఆ రౌడీలకు సమాచారం లీక్ అయ్యిందని పోలీసు ఉన్నతాధికారులు భావిస్తున్నారు.


కొద్దిరోజుల క్రితం గాజువాకలో బౌన్సర్లతో హోటల్‌లో రౌడీషీటర్ చిట్టిమాము పార్టీ చేసుకున్నాడు. పక్కా సమాచారంతో రంగంలోకి దిగిన టాస్క్ ఫోర్స్ ఆఫీసర్లు దాడులు చేసి పలువురిని అరెస్ట్ చేయడం జరిగింది. ఇటీవలే పోలీసులు రౌడీ మేళ నిర్వహించారు. రౌడీమూకల పార్టీపై పోలీసులు విచారిస్తున్నారు. తోటల్లో నుంచి ఎక్కడికెళ్లి ఉంటారు..? చుట్టు పక్కల ప్రాంతాల్లోనే ఉంటారని మామిడిపాలెం ప్రాంతం నలువైపులా పోలీసులు విస్తృతంగా గాలిస్తున్నారని తెలుస్తోంది.

Updated Date - 2020-07-17T00:01:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising