జగనన్న తోడు పథకం అమలుపై సమీక్ష
ABN, First Publish Date - 2020-12-20T05:07:34+05:30
మండలంలో జగనన్న తోడు పథకం లబ్ధిదారులు 922 మంది ఉండగా, ఇంత వరకు 406 మందికి మాత్రమే బ్యాంకుల్లో ప్రోసెస్ జరిగిందని వెలుగు ఏపీఎం బీవీ రమణ తెలిపారు.
మాట్లాడుతున్న వెలుగు ఏపీఎం రమణ
సబ్బవరం, డిసెంబరు 19 : మండలంలో జగనన్న తోడు పథకం లబ్ధిదారులు 922 మంది ఉండగా, ఇంత వరకు 406 మందికి మాత్రమే బ్యాంకుల్లో ప్రోసెస్ జరిగిందని వెలుగు ఏపీఎం బీవీ రమణ తెలిపారు. మండల పరిషత్ కార్యాలయంలో శనివారం జగనన్న తోడు పథకం అమలుపై సచివాలయ కార్యదర్శులు, వెల్ఫేర్ అసిస్టెంట్లతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బ్యాంకర్లను నిత్యం కలిసి ప్రోసెస్ పూర్తి చేయాలన్నారు. ఈ సమావేశంలో ఏవో బాబూరావు, ఈవోపీఆర్‌డీ ప్రేమసాగర్ తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2020-12-20T05:07:34+05:30 IST