ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

షిప్‌యార్డులో క్రేన్‌ ప్రమాదంపై కలెక్టర్‌కు నివేదిక

ABN, First Publish Date - 2020-08-12T10:07:49+05:30

హిందూస్థాన్‌ షిప్‌యార్డులో ఇటీవల క్రేన్‌ కుప్పకూలిన ఘటనపై విశాఖ ఆర్డీవో కె.పెంచలకిశోర్‌ నేతృత్వంలో ఏర్పాటైన విచారణ ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విశాఖపట్నం, ఆగస్టు 11(ఆంధ్రజ్యోతి): హిందూస్థాన్‌ షిప్‌యార్డులో ఇటీవల క్రేన్‌ కుప్పకూలిన ఘటనపై విశాఖ ఆర్డీవో కె.పెంచలకిశోర్‌ నేతృత్వంలో ఏర్పాటైన విచారణ కమిటీ మంగళవారం కలెక్టర్‌ వి.వినయ్‌చంద్‌కు నివేదికను అందజేశారు. ఈ కమిటీలో ఏయూకు చెందిన మెకానికల్‌, సివిల్‌, ఎలక్ట్రికల్‌, ఎలక్టా్ట్రనిక్స్‌ విభాగాలకు చెందిన ఆచార్యులు సభ్యులుగా ఉన్నారు. కమిటీ సభ్యులు ప్రమాద స్థలాన్ని సందర్శించి పలు అంశాలను పరిశీలించారు.


సామర్థ్యం లేకపోవడంతో షిప్‌యార్డులో క్రేన్‌ కుప్పకూలిందని కమిటీ గుర్తించింది. క్రేన్‌ సామర్థ్యం 70 టన్నులు కాగా అదనంగా 30 టన్నులు బరువు వేసినా కాయాల్సి ఉంది. అయితే 70 టన్నులకే కుప్పకూలడంతో క్రేన్‌ సామర్థ్యంపై కమిటీ సందేహం వ్యక్తంచేసింది. క్రేన్‌ నిర్మాణానికి సంబంధించి అన్ని విషయాలు అందుబాటులో లేకపోవడంపై కమిటీ ఆశ్చర్యం వ్యక్తంచేసింది. నివేదికలో పూర్తి వివరాలు జిల్లా యంత్రాంగం వెల్లడించాల్సి ఉంది. 

Updated Date - 2020-08-12T10:07:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising