ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎల్‌జీ పాలిమర్స్‌ ప్రమాదంపై సిద్ధమైన విచారణ నివేదిక

ABN, First Publish Date - 2020-07-04T19:09:34+05:30

ఎల్‌జీ పాలిమర్స్‌ ఘటనపై ప్రభుత్వం నియమించిన ఉన్నత స్థాయి కమిటీ ముసాయిదా నివేదిక సిద్ధం చేసింది. అటవీ, పర్యావరణ శాఖ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విశాఖపట్నం  (ఆంధ్రజ్యోతి): ఎల్‌జీ పాలిమర్స్‌ ఘటనపై ప్రభుత్వం నియమించిన ఉన్నత స్థాయి కమిటీ ముసాయిదా నివేదిక సిద్ధం చేసింది. అటవీ, పర్యావరణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నీరబ్‌కుమార్‌ ప్రసాద్‌ నేతృత్వంలోని కమిటీ రూపొందించిన నివేదికను మరోసారి పరిశీలన నిమిత్తం సభ్యులకు పంపినట్టు తెలిసింది. ప్రమాదంపై గత నెల 30న ప్రభుత్వానికి కమిటీ నివేదిక ఇవ్వాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ముసాయిదా నివేదిక సిద్ధం చేసింది. కమిటీ సభ్యులు ముసాయిదా నివేదిక పరిశీలించిన తరువాత తుది నివేదిక రూపొందిస్తారు. అయితే కర్మాగార యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందని ప్రాథమికంగా కమిటీ తేల్చింది. యాజమాన్యం, సంబంధిత అధికారులపై తీసుకోవలసి చర్యలతోపాటు బాధిత గ్రామాల్లో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఈ నివేదికలో పొందుపరిచే అవకాశం వుందని తెలిసింది. 

Updated Date - 2020-07-04T19:09:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising