ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఏయూ ప్రొఫెసర్‌కు ప్రపంచ ర్యాంకింగ్‌

ABN, First Publish Date - 2020-11-13T05:39:38+05:30

ఆంధ్ర విశ్వవిద్యాలయం భూవిజ్ఞానశాస్త్రం పూర్వ విభాగాధిపతి ప్రొఫెసర్‌ నందిపాటి సుబ్బారావును ప్రపంచ ర్యాంకింగ్‌ వరించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

భూవిజ్ఞానశాస్త్రంలో చేసిన పరిశోధనలకు 557వ ర్యాంక్‌ సాధించిన నందిపాటి సుబ్బారావు

ఏయూ క్యాంపస్‌, నవంబరు 12: ఆంధ్ర విశ్వవిద్యాలయం భూవిజ్ఞానశాస్త్రం పూర్వ విభాగాధిపతి ప్రొఫెసర్‌ నందిపాటి సుబ్బారావును ప్రపంచ ర్యాంకింగ్‌ వరించింది. భూవిజ్ఞానశాస్త్రంలో చేసిన పరిశోధనలకు గాను ప్రపంచ వ్యాప్తంగా 557వ ర్యాంక్‌ను ఆయన సాధించారు. యూఎస్‌ఏలోని స్టాన్‌ఫర్డ్‌ యూనివర్సిటీ గత ఏడాది వివిధ సబ్జెక్టులపై సర్వే నిర్వహించింది. ఎన్విరాన్‌మెంటల్‌ ఇంజనీరింగ్‌లో చేసిన సర్వేలో భాగంగా ప్రపంచవ్యాప్తంగా భూవిజ్ఞానశాస్త్రంలో చేసిన పరిశోధనలకు గాను టాప్‌ రెండు శాతంలో ఆయన నిలిచి 557వ ర్యాంక్‌ను దక్కించుకున్నారు. ఈ సందర్భంగా ప్రొఫెసర్‌ సుబ్బారావు గురువారం ‘ఆంధ్రజ్యోతి’తో మాట్లాడుతూ ప్రపంచవ్యాప్త ర్యాంకింగ్‌లో తాను స్థానం పొందడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. విస్తృత స్థాయిలో చేసిన పరిశోధనల వల్లే తనకు 557వ ర్యాంక్‌ వచ్చిందన్నారు. ఇటీవలే స్టాన్‌ఫర్డ్‌ యూనివర్సిటీ ఈ ర్యాకింగ్‌లను ప్రకటించిందని తెలిపారు.

Updated Date - 2020-11-13T05:39:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising