ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వ్యర్థాలను శుద్ధి చేసే సముద్రంలో విడిచిపెడుతున్నాం

ABN, First Publish Date - 2020-11-04T01:59:35+05:30

ఫార్మా వ్యర్థ రసాయనాలను శుద్ధి చేసిన తరువాతే పైప్‌లైన్‌ ద్వారా తిక్కవానిపాలెం తీరం వద్ద సముద్రంలో విడిచిపెడుతున్నామని ఫార్మాసిటీ రాంకీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ (ఎమ్‌డీ) లాల్‌కృష్ణ స్పష్టం చేశారు.

విలేకరులతో మాట్లాడుతున్న రాంకీ ఎమ్‌డీ లాల్‌కృష్ణ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చేపలు చనిపోవడానికి రాంకీ కారణం కాదు 

రాంకీ ఎమ్‌డీ లాల్‌కృష్ణ


పరవాడ, నవంబరు 3: ఫార్మా వ్యర్థ రసాయనాలను శుద్ధి చేసిన తరువాతే పైప్‌లైన్‌ ద్వారా తిక్కవానిపాలెం తీరం వద్ద సముద్రంలో విడిచిపెడుతున్నామని ఫార్మాసిటీ రాంకీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ (ఎమ్‌డీ) లాల్‌కృష్ణ స్పష్టం చేశారు. మంగళవారం ఆయన రాంకీ కమర్షియల్‌ హబ్‌లో స్థానిక మీడియాతో మాట్లాడుతూ  ఫార్మా వ్యర్థ జలాల కారణంగానే పరవాడ పెద్ద చెరువులో మత్స్య సంపద చనిపోయిందనడంలో వాస్తవం లేదన్నారు. సంబంధిత చెరువు నీటి నమూనాలను పీసీబీ అధికారులు పరీక్షల కోసం ల్యాబ్‌కు పంపించారని, ఇంకా నివేదిక రాకముందే రాంకీపై అభాండాలు వేయడం సరికాదన్నారు. సోషల్‌ మీడియా వేదికగా రాంకీ సంస్థపై తప్పుడు ప్రచారాలు చేయడం మానుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఇటువంటి ప్రచారాలు చేయడం వల్ల ఫార్మా రంగం అఽభివృద్ధికి విఘాతం కలుగుతుందన్నారు. ఫార్మాసిటీలో మొత్తం 32 వేల మంది ఉపాధి పొందుతున్నారని, 103 కంపెనీలు నిర్మాణ పనులు ప్రారంభించగా, ఇప్పటికే 85 నుంచి 90 కంపెనీలు ఉత్పత్తిని కూడా ప్రారంభించాయన్నారు. ఫార్మాసిటీ ద్వారా 25 వేల కోట్ల ఇన్వెస్ట్‌మెంట్‌ చేయడం జరిగిందన్నారు. ఫార్మా రంగానికి సంబంధించి ముడిసరుకు 65 శాతం చైనా నుంచే దిగుమతి చేసుకుంటున్నామని పేర్కొన్నారు. అన్ని విధాలా అభివృద్ధి పఽథం లో దూసుకుపోతున్న తరుణంలో రాంకీ ఫార్మాసిటీపై కాలుష్యం పేరుతో తప్పుడు ప్రచారం చేయడం సమంజసం కాదని అభిప్రాయ పడ్డారు. కాలుష్యానికి సంబంధించి ఫార్మా కంపెనీలకు చెందిన ఆరుగురు సభ్యులతో కూడిన కమిటీని కూడా వేశామన్నారు. తమకు త్వరలోనే  కమిటీ  నివేదిక అందజేస్తుందని, దాని ఆధారంగా చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. 


Updated Date - 2020-11-04T01:59:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising