రైళ్లలో ప్రయాణికుల భద్రతకు పటిష్ఠ చర్యలు
ABN, First Publish Date - 2020-11-13T05:51:42+05:30
రైళ్లలో ప్రయాణించేవారి భద్రతపై ఆర్పీఎఫ్, జీఆర్పీ ప్రత్యేక దృష్టి సారించింది. సురక్షిత ప్రయాణం అందించడంలో భాగంగా రైళ్లలోనే ఫిర్యాదు చేసుకునే సదుపాయాన్ని కల్పించారు.
విశాఖపట్నం, నవంబరు 12: రైళ్లలో ప్రయాణించేవారి భద్రతపై ఆర్పీఎఫ్, జీఆర్పీ ప్రత్యేక దృష్టి సారించింది. సురక్షిత ప్రయాణం అందించడంలో భాగంగా రైళ్లలోనే ఫిర్యాదు చేసుకునే సదుపాయాన్ని కల్పించారు. ప్రయాణికునికి అసౌకర్యం కల్పించినా, వేధింపులకు గురిచేసిన వారిపై తక్షణ చర్యలు చేపట్టాలా జీరో ఎఫ్‌ఐ ఆర్‌ను ప్రవేశపెట్టారు. ప్రయాణ సమయంలో బాధితులకు తగిన రక్షణ కల్పించడంతోపాటు వేధింపులకు పాల్పడే వారిపై వెంటనే చర్యలు తీసుకోనున్నారు. కొన్ని ప్రధాన ఎక్స్‌ప్రెస్ రైళ్ల స్లీపర్ క్లాసు ఎస్-1 కోచ్‌లో 63 నంబరు బెర్తులో ఆర్పీఎఫ్, జీఆర్పీకి చెందిన ప్రత్యేక ఎస్కార్ట్ సిబ్బంది అందుబాటులో వుంటారు. బాధితులు నేరుగా బెర్తు వద్దకు వెళ్లి ఫిర్యాదు చేస్తే తక్షణ చర్యలు తీసుకుంటారు.
Updated Date - 2020-11-13T05:51:42+05:30 IST