ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

క్వారంటైన్‌ గడువు 28 రోజులు

ABN, First Publish Date - 2020-04-07T11:38:23+05:30

కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అనుమానితుల క్వారంటైన్‌ గడువును 14 రోజుల నుంచి 28 రోజులకు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నర్సీపట్నం ఆర్డీవో కె.ఎల్‌.శివజ్యోతి

రెడ్‌ జోన్‌గా నర్సీపట్నం మున్సిపాలిటీ


నర్సీపట్నం(విశాఖపట్నం): కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అనుమానితుల క్వారంటైన్‌ గడువును 14 రోజుల నుంచి 28 రోజులకు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని నర్సీపట్నం ఆర్డీవో కె.ఎల్‌.శివజ్యోతి తెలిపారు. సోమవారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ నర్సీపట్నంలో రెండు పాజిటివ్‌ కేసులు నమోదైనందున రెడ్‌జోన్‌గా పరిగణిస్తున్నట్లు చెప్పారు. అనుమానితులు ఇకపై రెట్టింపు రోజులు వైద్య నిర్బంధంలో ఉండాల్సి ఉంటుందని చెప్పారు. అలాగే నర్సీపట్నం ప్రాంతీయ ఆసుపత్రిలో ఏర్పాటుచేసిన క్వారంటైన్‌ కేంద్రాన్ని ఇతర రోగుల శ్రేయస్సు దృష్ట్యా రద్దుచేసి పట్టణ శివారులోని ఎస్టీ బాలుర గృహంలో ఒకటి, కొండల అగ్రహారంలోని ఇమ్మానియేల్‌ ఆసుపత్రిలో మరికొన్ని పడకలు సిద్ధం చేసినట్లు తెలిపారు.


నర్సీపట్నం మున్సిపాలిటీ పరిధిలో పారిశుధ్య పరిస్థితులు మెరుగుకు తగిన చర్యలు తీసుకుంటున్నామని, జనరల్‌ ఫండ్స్‌తో అవసరమైతే అదనపు పారిశుధ్య సిబ్బందిని నియమిస్తామని చెప్పారు. పీహెచ్‌ల్లో సేవలందిస్తున్న సిబ్బందికి దాతల సహకారంతో రక్షణ సామగ్రి అందిస్తున్నామని డెక్కన్‌ కెమికల్స్‌ అందించిన 20 పీపీఏ కిట్లు ఇప్పటికే పంపిణీ చేసినట్లు తెలిపారు. మున్సిపాలిటీ పరిధిలో చేపలు, మాంసం విక్రయాల తూనికల్లో తేడాలు, ధరలను జేసీ దృష్టికి తీసుకువెళ్లనున్నట్లు తెలిపారు.  

Updated Date - 2020-04-07T11:38:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising