ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సిద్ధమైన కార్గో సర్వీసులు

ABN, First Publish Date - 2020-06-06T08:23:59+05:30

ఆంధ్రప్రదేశ్‌ పౌర రవాణా శాఖ విశాఖ రీజియన్‌ యాజమాన్యం కార్గో రవాణా వాహన తయారీపై దృష్టిపెట్టింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ద్వారకాబస్‌స్టేషన్‌,  జూన్‌ 5: ఆంధ్రప్రదేశ్‌ పౌర రవాణా శాఖ విశాఖ రీజియన్‌ యాజమాన్యం కార్గో రవాణా వాహన తయారీపై దృష్టిపెట్టింది. ఇప్పటివరకు 26 వాహనాలు సేవలందిస్తుండగా, మరో 12 రూపుదిద్దుకుంటున్నాయి. వాల్తేరులో 7, విశాఖపట్నంలో మూడు, గాజువాక, సింహాచలం, మధురవాడ, స్టీల్‌సిటీ, అనకాపల్లి, పాడేరు, నర్సీపట్నం, మద్దిలపాలెం డిపో గ్యారేజీల్లో రెండేసి చొప్పున తయారయ్యాయి. గతంలో ప్రైవేటు లారీలను వినియోగించగం, ప్రస్తుతం సొంతంగా వాహనాలను సమకూర్చుకుంటోంది. 


లాజిస్టిక్స్‌లో వాల్తేరు డిపో ప్రథమం

లాజిస్టిక్స్‌ ద్వారా ఆదాయం సమకూర్చుకోవడంలో వాల్తేరు డిపో నంబర్‌వన్‌గా నిలిచింది. గత నెలలో విశాఖ రీజియన్‌కు రూ.29,48,542 ఆదాయం వచ్చింది. వాల్తేరు డిపో రూ.8,16,033 ఆర్జించగా, నర్సీపట్నం రూ.4,35,507, గాజువాక రూ.3,01,512, మధురవాడ రూ.2,73,401, అనకాపల్లి రూ.2,60,149,  విశాఖపట్నం రూ.2,30,155,  పాడేరు రూ.1,87,220, స్టీల్‌సిటీ రూ.1,65,398, మద్దిలపాలెం రూ.1,64,035 , సింహాచలండిపోలు రూ.1,15,132 ఆదాయం సమకూర్చాయి.

Updated Date - 2020-06-06T08:23:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising