ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కోటవురట్ల స్టేషన్‌లో కాసేపు సందడి

ABN, First Publish Date - 2020-11-21T05:40:32+05:30

కోటవురట్ల పోలీసు స్టేషన్‌ సిబ్బంది కాసేపు అవాక్కయ్యారు.

ఎస్‌ఐగా బాధ్యతలు చేపట్టిన బాలిక అనంతలక్ష్మి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 గంటపాటు సరదాగా ఎస్‌ఐ బాధ్యతలు చేపట్టిన బాలిక

బాలికల దినోత్సవం సందర్భంగా గొప్పమనసు చాటిన ఎస్‌ఐ

కోటవురట్ల, నవంబరు 20 : కోటవురట్ల పోలీసు స్టేషన్‌ సిబ్బంది కాసేపు అవాక్కయ్యారు. ఉదయం విధులకు హాజరయ్యే సమయానికి ఎస్‌ఐ సురేశ్‌కుమార్‌ ఆ సీట్లో ఉన్నారు. సరిగ్గా 10 గంటల సమయంలో చూసే సరికి ఓ మహిళా అధికారి ఆ కుర్చీలో ఆశీనులయ్యారు. ఇంత లోనే ఏం జరిగిందంటూ.. ఆరా తీసే పనిలో పడ్డారు.  ఆ తరువాత అసలు విషయం తెలుసుకుని సంబరపడ్డారు. ఇందుకు సంబంధించి విరాలివి. సీఫా స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో శుక్రవారం  కోటవురట్ల పోలీసు స్టేషన్‌లో ప్రపంచ బాలికల దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సం దర్భంగా అనంతలక్ష్మి అనే ఓ బాలిక చురుకుదనాన్ని చూసి ఎస్‌ఐ సురేశ్‌కుమార్‌ ఉప్పొంగిపోయారు. అంతేకాకుండా ఆమెకు ఒక గంటపాటు సరదాగా ఎస్‌ఐ బాధ్యతలు అప్పగించి తన గొప్ప మనసుతో పాటు ప్రజల పట్ల పోలీసులకున్న సహృదయాన్ని చాటిచెప్పారు. అనంతరం ఆ బాలిక మాట్లాడుతూ పిల్లలంతా చక్కగా చదువు కోవాలని, బాల్య వివాహాల నివారణకు అంతా కంకణబద్ధులు కావాలని తెలిపింది. 


Updated Date - 2020-11-21T05:40:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising