ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సెల్లార్లను పార్కింగ్‌కు వినియోగించాల్సిందే

ABN, First Publish Date - 2020-12-12T05:01:58+05:30

గోపాలపట్నం ప్రధాన రహదారిలో ఉన్న భారీ వ్యాపార సముదాయాల్లో సెల్లార్లను పార్కింగ్‌కు వినియోగించడం లేదు. సెల్లార్లలో దుకాణాలు ఏర్పాటు చేసుకోవడంతో ట్రాఫిక్‌ ఇబ్బందులు తలెత్తుతున్నాయి.

దుకాణ సిబ్బందికి సూచనలిస్తున్న గోపాలపట్నం ట్రాఫిక్‌ సీఐ శ్రీహరిరాజు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వ్యాపారులకు పోలీసుల ఆదేశం

గోపాలపట్నం, డిసెంబరు 11: గోపాలపట్నం ప్రధాన రహదారిలో ఉన్న భారీ వ్యాపార సముదాయాల్లో సెల్లార్లను పార్కింగ్‌కు వినియోగించడం లేదు. సెల్లార్లలో దుకాణాలు ఏర్పాటు చేసుకోవడంతో ట్రాఫిక్‌ ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో పలు ప్రాంతాల్లో గోపాలపట్నం ట్రాఫిక్‌ సీఐ డి.శ్రీహరిరాజు శుక్రవారం పర్యటించారు. గోపాలపట్నం ప్రధాన రహదారిలో సుమారు 10 వరకు భారీ వ్యాపార సముదాయాలు ఉన్నాయి. వీటిలో దాదాపుగా అన్ని వ్యాపార సముదాయాలకు సెల్లార్‌ పార్కింగ్‌లు ఉన్నాయి. ఈ దుకాణాలకు వచ్చే కొనుగోలుదారులు తప్పనిసరిగా సెల్లార్‌లోనే తమ వాహనాలను పార్కింగ్‌ చేసే విధంగా దుకాణ యజమానులు దృష్టిసారించాలని వారికి సీఐ నోటీసులు అందజేశారు. తప్పనిసరిగా సెల్లార్‌ పార్కింగ్‌లు వినియోగించాలని, లేనిపక్షంలో కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.


మల్కాపురంలో..

మల్కాపురం: శ్రీహరిపురంలో సెల్లార్లలో దుకాణాలు ఏర్పాటు చేసుకున్న వ్యాపారులను ఖాళీ చేయాలని మల్కాపురం ట్రాఫిక్‌ పోలీసులు ఆదేశించారు. నిబంధనలకు విరుద్ధంగా దుకాణాలను ఏర్పాటు చేయడం వల్ల వాహనాలను రోడ్డుపైనే పార్కింగ్‌ చేస్తున్నారని, అందువల్ల ట్రాఫిక్‌ ఇబ్బందులు తలెత్తుతున్నాయని చెప్పారు. మల్కాపురం ట్రాఫిక్‌ ఎస్‌ఐ నరసింగరావు ఆధ్వర్యంలో సిబ్బంది శుక్రవారం పలు ప్రాంతాల్లో సెల్లార్లలో ఉన్న దుకాణాల వద్దకు వెళ్లి వాటిని ఖాళీ చేయాలని వ్యాపారులకు తెలిపారు.


పెందుర్తిలో..

పెందుర్తి: చినముషిడివాడ, పెందుర్తి, సుజాతనగర్‌, వేపగుంట తదితర ప్రాంతాల్లో గల వాణిజ్యసముదాయాల  సెల్లార్‌లను శుక్రవారం ట్రాఫిక్‌ ఎస్‌ఐ  భరత్‌కుమార్‌రాజు పరిశీలించారు. చినముషివాడ, సుజాతనగర్‌లో డిజిటల్‌ పరీక్షా కేంద్రాల్లో సెల్లార్లు దుర్వినియోగం అవుతున్నట్టు గుర్తించారు. సెల్లార్లు ఆక్రమించి పార్కింగ్‌ సదుపాయం లేకుండా వ్యాపారాలు నిర్వహిస్తే చట్టపరమైన   చర్యలు తీసుకుంటామని  నిర్వాహకులను హెచ్చరించారు.

Updated Date - 2020-12-12T05:01:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising