ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పెట్రోల్‌ బంక్‌లను నిర్వహించలేం

ABN, First Publish Date - 2020-02-05T19:11:43+05:30

అరకులోయ, డుంబ్రిగుడలలో జీసీసీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న హెచ్‌సీసీఎల్‌ బంక్‌లను..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • ప్రతి నెలా నష్టాన్ని తామేందుకు భరించాలి...
  • ప్రశ్నిస్తున్న బంక్‌ల సేల్స్‌మెన్‌..
  • నేటి నుంచి బంకుల మూసివేత

అరకులోయ, డుంబ్రిగుడలలో జీసీసీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న హెచ్‌సీసీఎల్‌ బంక్‌లను నిర్వహించ లేమని జీసీసీ సేల్స్‌మెన్‌ స్పష్టం చేశారు. ఈమేరకు మంగళవారం వారు స్థానిక బ్రాంచి మేనేజర్‌, డీఎం, ఎండీలకు లిఖితపూర్వకంగా కోరారు. పెట్రోల్‌ బంక్‌లను నిర్వహించడం ఆషామాషీకాదన్నారు. ప్రతి నెల తమకు రూ.15 వేల నుంచి రూ.20 వేల వరకు నష్టం వాటిల్లుందన్నారు. అరకులోయ హెచ్‌పీసీఎల్‌ బంక్‌లో ఆరు నెలలకు రూ. ఒక లక్షా 80 వేలు నష్టం వచ్చిందని సేల్స్‌మెన్‌ కె.గురు చెప్పారు.

 

డుంబ్రిగుడ హెచ్‌పీసీఎల్‌ బంక్‌లో ఏడాదికి రూ.60 వేలు నష్టం వాటిల్లిందని సేల్స్‌మెన్‌ ఎం.బాలరాజు తెలిపారు. డిపోలలో పనిచేసే తమకు ఈ బంక్‌లలో సేల్స్‌మెన్‌గా అధికారులు నియమించారు. తమకు వచ్చిన జీతం కన్నా ప్రతి నెల నష్టం వచ్చిన సొమ్ము ఎక్కువగా ఉంటుందని వాపోయారు. తాము చేయని తప్పుకు శిక్ష ఎందుకు అనుభవించాలని, ప్రతి నెల వేల రూపాయలు తామెందుకు చెల్లించాలని ప్రశ్నించారు. బుధవారం నుంచి బంకులను మూసివేస్తున్నట్టు స్పష్టం చేశారు. ఇదే విషయాన్ని బ్రాంచి మేనేజర్‌కు, జీసీసీ డీఎం, విశాఖపట్నంకు తెలియజేశామన్నారు.

Updated Date - 2020-02-05T19:11:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising