పెండింగ్ జీతాలు తక్షణమే చెల్లించాలి
ABN, First Publish Date - 2020-12-30T04:57:41+05:30
పెండింగ్ జీతాలు, హెల్త్ అలవెన్స్‌లను తక్షణమే చెల్లించాలని జీవీఎంసీ పారిశుధ్య కార్మికులు డిమాండ్ చేశారు.
జోన్-4 కార్యాలయం ఎదుట నిరసన తెలుపుతున్న కార్మికులు
కంచరపాలెం, డిసెంబరు 29: పెండింగ్ జీతాలు, హెల్త్ అలవెన్స్‌లను తక్షణమే చెల్లించాలని జీవీఎంసీ పారిశుధ్య కార్మికులు డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం జ్ఞానాపురం జోనల్ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. మూడు నెలలుగా జీతాలు, ఆరునెలల నుంచి హెల్త్ అలవెన్స్‌లను మంజూరు చేయలేదని, పండుగ సమయంలో జీతాలు లేకుండా పనిచేయలేమని నినాదాలు చేశారు. కార్యక్రమంలో సిటూ నాయకులు పి.వెంకటరెడ్డి, ఎం.నాగేశ్వరరావు, ఒమ్మి అప్పారావు తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2020-12-30T04:57:41+05:30 IST