వరలక్ష్మి కుటుంబ సభ్యులకు పలువురి పరామర్శ
ABN, First Publish Date - 2020-11-03T05:46:53+05:30
ప్రేమోన్మాది చేతిలో కిరాతకంగా హత్యకు గురైన వరలక్ష్మి కుటుంబ సభ్యులను తెలుగుదేశం పార్టీ విశాఖ పార్లమెంట్ కమిటీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరవు పరామర్శించారు.
గాజువాక: ప్రేమోన్మాది చేతిలో కిరాతకంగా హత్యకు గురైన వరలక్ష్మి కుటుంబ సభ్యులను తెలుగుదేశం పార్టీ విశాఖ పార్లమెంట్ కమిటీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరవు పరామర్శించారు. నిందితులను కఠినంగా శిక్షించాలని, ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా కఠిన నిర్ణయాలు తీసుకోవాలన్నారు. ఆయన వెంట జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు పుచ్చా విజయ్‌కుమార్, పప్పు శంకరరావు ఉన్నారు.
జనసేన నాయకుల పరామర్శ
కూర్మన్నపాలెం / ఆటోనగర్: జనసేన అఽధినేత పవన్ కల్యాణ్ ఆదేశాల మేరకు వరలక్ష్మి కుటుంబాన్ని ఆ పార్ట్టీ విశాఖ ఉత్తర నియోజకవర్గ ఇన్‌చార్జ్ పసుపులేటి ఉషాకిరణ్ స్థానిక మహిళా నేతలతో కలిసి సోమవారం పరామర్శించారు. బాఽధిత కుటుంబానికి జనసేన పార్టీ అండగా ఉంటుందన్నారు. లంకల మురళీదేవి, అడబాల లక్ష్మి, కళావతి తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2020-11-03T05:46:53+05:30 IST