ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పంచాయతీలకు ఊరట

ABN, First Publish Date - 2020-11-20T05:40:36+05:30

ఏడాది క్రితం రావలసిన 14వ ఆర్థిక సంఘం చివరి విడత నిధులు ఎట్టకేలకు పంచాయతీలకు చేరాయి. జిల్లాకు రూ.75 కోట్లు మంజూరుకాగా...వీటిలో రూ.70.38 కోట్లు పంచాయతీల ఖాతాలకు జమ చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

14వ ఆర్థిక సంఘం తుది విడత నిధులు విడుదల

బ్యాంకు ఖాతాలకు రూ.75 కోట్లు జమ


విశాఖపట్నం, నవంబరు 19 (ఆంధ్రజ్యోతి): ఏడాది క్రితం రావలసిన 14వ ఆర్థిక సంఘం చివరి విడత నిధులు ఎట్టకేలకు పంచాయతీలకు చేరాయి. జిల్లాకు రూ.75 కోట్లు మంజూరుకాగా...వీటిలో రూ.70.38 కోట్లు పంచాయతీల ఖాతాలకు జమ చేశారు. మిగిలిన నిధులు నీటి పథకాల నిర్వహణ, ఇతరత్రా వ్యయాల కోసం జిల్లా పరిషత్‌కు కేటా యించారు. పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించక పోవడంతో గత ఆర్థిక సంవత్సరంలో విడుదల కావ లసిన 14వ ఆర్థిక సంఘం నిధులు నిలిచిపోయాయి. దీంతో పంచాయతీలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొ న్నాయి. ఈలోగా 15వ ఆర్థిక సంఘం ఏర్పాటైంది. ఇదే సమయంలో కరోనా వైరస్‌ వ్యాప్తి చెందడంతో కేంద్రం అప్రమత్తమై అన్ని రాష్ట్రాల్లో పంచాయతీలకు నిధులు మంజూరుచేసింది. ఈ మేరకు మార్చి 25న 2018-19 సంవత్సరానికి సంబంధించిన తుది విడత, అదే నెలాఖరులో 2019-20కి సంబంధించి తొలి విడత నిధులు వచ్చాయి. ఈ నెల తొలివారంలో 2020-21 సంవత్సరం తొలివిడత నిధులు పంచాయతీలకు విడు దల చేశారు. తాజాగా 2019-20 సంవత్సరం తుది విడత నిధులు జమ కావడంతో పంచాయతీలు ఆర్థిక ఇబ్బందుల నుంచి ఒడ్డెక్కే అవకాశం ఉంది. ఈ నిధు లను పంచాయతీలు నీటి పథకాల నిర్వహణ, విద్యుత్‌ బిల్లుల బకాయిలు చెల్లింపు, పారిశుధ్య సిబ్బందికి వేతనాలు చెల్లింపునకు వినియోగించుకోవచ్చునని సంబంధిత అధికారి ఒకరు తెలిపారు.

Updated Date - 2020-11-20T05:40:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising