ఆర్టీసీ స్థలాల పరిరక్షణ కు ఉద్యమం
ABN, First Publish Date - 2020-09-14T09:07:30+05:30
జిల్లాలోని ఆర్టీసీ స్థలాల పరిరక్షణకు ఉద్యమిస్తామని సీపీఐ నగర కార్యదర్శి ఎం.పైడిరాజు తెలిపారు.
సీపీఐ నగర కార్యదర్శి ఎం.పైడిరాజు
విశాఖపట్నం, సెప్టెంబర్ 13(ఆంధ్రజ్యోతి): జిల్లాలోని ఆర్టీసీ స్థలాల పరిరక్షణకు ఉద్యమిస్తామని సీపీఐ నగర కార్యదర్శి ఎం.పైడిరాజు తెలిపారు. ‘ఆర్టీసీ స్థలాలు ప్రైవేటుకి ధారాదత్తం‘ శీర్షికతో ఆంరఽధజ్యోతిలో కథనం ప్రచురితమైనప్పటి నుంచి ఆయా స్థలాల పరిరక్షణకు సీపీఐ ఉద్యమం ప్రారంభించిందన్నారు. ఆర్టీసీకి ఆదాయం పెంచేందుకంటూ మద్దిలపాలెం, నర్సీపట్నం, ద్వారకాబస్‌స్టేషన్ స్థలాలను పీపీపీ పద్ధతిలో ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టాలని ప్రభుత్వం నిర్ణయించడం దారుణమన్నారు.
ప్రైవేటు వ్యక్తులైనా బ్యాంకుల నుంచి రుణం తీసుకునే ఆయా ప్రాజెక్టులను చేపడతాయని, నిజంగా స్థలాలను అభివృద్ధి చేయాలనుకుంటే రాష్ట్ర ప్రభుత్వమే బ్యాంకుల నుంచి రుణం తీసుకుని ఆ పని చేయవచ్చన్నారు. ఒకప్పుడు నగరాలు, పట్టణాలకు శివారు ప్రాంతాల్లో ఆర్టీసీకి స్థలాలు కేటాయించారని, అవి ఇప్పుడు నడిబొడ్డుకు రావడంతో వాటి విలువ అమాంతంగా పెరిగిపోయిందన్నారు. అంత ఖరీదైన భూములను ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టేయకుండా ప్రభుత్వమే వాటిని అభివృద్ధి చేయాలని డిమాండ్ చే శారు.
Updated Date - 2020-09-14T09:07:30+05:30 IST