ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఉల్లి రూ.80

ABN, First Publish Date - 2020-10-20T09:03:46+05:30

ఉల్లి ధర రోజురోజుకూ పెరుగుతోంది. ఆదివారం నాటికి రైతుబజార్లలో కిలో రూ.57 ఉన్న ధర

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రైతుబజార్లలో రూ.65

...అయినా దొరకని సరకు

విశాఖపట్నం, అక్టోబరు 19 (ఆంధ్రజ్యోతి): ఉల్లి ధర రోజురోజుకూ పెరుగుతోంది. ఆదివారం నాటికి రైతుబజార్లలో కిలో రూ.57 ఉన్న ధర సోమవారం రూ.65కి చేరింది. హోల్‌సేల్‌ మార్కెట్‌లో ఉదయం రూ.65కు విక్రయించి పది గంటల తరువాత రూ.70కి పెంచేశారు. పైగా రెగ్యులర్‌గా అరువుపై ఉల్లిని తీసుకువెళ్లే డ్వాక్రా సంఘాలకు ‘నగదు ఇస్తేనే సరకు ఇస్తాము’ అంటూ నిబంధన పెట్టారు. దాంతో పలు రైతుబజార్లకు అనుకున్న స్థాయిలో ఉల్లి రాలేదు.


ఇక బహిరంగ మార్కెట్‌లో ఈ ధర రూ.80కి చేరింది. మహారాష్ట్ర నుంచి సోమవారం ఒక్క లారీయే జ్ఞానపురం మార్కెట్‌కు వచ్చింది. దాంతో డిమాండ్‌ అమాంతం పెరిగింది. చూస్తుండగానే కిలో రూ.100కు చేరిపోయే పరిస్థితి వచ్చింది. దీనిపై జిల్లా యంత్రాంగం ఇంతవరకు దృష్టి పెట్టలేదు. టోకున రాష్ట్ర ప్రభుత్వమే కొని తక్కువ ధరకు సరఫరా చేస్తే తప్ప సామాన్యులకు ఉల్లి అందని పరిస్థితి ఏర్పడింది. 


Updated Date - 2020-10-20T09:03:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising