ఎన్‌ఏడీ ఫ్లైఓవర్‌పై మరిన్ని రాకపోకలు
ABN, First Publish Date - 2020-12-30T05:40:40+05:30
ఎన్‌ఏడీ జంక్షన్‌లో నిర్మించిన ఫ్లైఓవర్‌లో అప్పర్ రోటరీ పనులు పూర్తి కావడంతో మరో మార్గంలో వాహనాల రాకపోకలను మంగళవారం నుంచి అనుమతించారు
గోపాలపట్నం నుంచి ఎటైనా వెళ్లొచ్చు!
విశాఖపట్నం, డిసెంబరు 29(ఆంధ్రజ్యోతి): ఎన్‌ఏడీ జంక్షన్‌లో నిర్మించిన ఫ్లైఓవర్‌లో అప్పర్ రోటరీ పనులు పూర్తి కావడంతో మరో మార్గంలో వాహనాల రాకపోకలను మంగళవారం నుంచి అనుమతించారు. ఇప్పటివరకు ఈ ఫ్లైఓవర్‌పై విమానాశ్రయం నుంచి ఎన్‌ఎస్‌టీఎల్, గోపాలపట్నం వైపు మాత్రమే వాహనాలను అనుమతిస్తున్నారు. తాజాగా గోపాలపట్నం నుంచి వచ్చేవారు ఎటువైపు అయినా వెళ్లే అవకాశం కల్పించారు. అంటే నేరుగా పైనుంచి మర్రిపాలెం లేదా విమానాశ్రయం వైపు పోవచ్చు. ఇటు ఎడమ వైపు తిరిగి ఎన్‌ఎస్‌టీఎల్ రహదారిలో నగరంలోకి రావచ్చు. ప్రస్తుతం గోపాలపట్నం నుంచి వచ్చేవారు తప్పనిసరిగా ఫ్లైఓవర్‌నే వినియోగించాలి. కిందన లోవర్ రోటరీ పనుల కోసం రాకపోకలను నిలిపివేశారు.
Updated Date - 2020-12-30T05:40:40+05:30 IST