వంద కార్లు ఒకేచోట పార్కింగ్
ABN, First Publish Date - 2020-12-29T06:09:54+05:30
‘మల్టీలెవెల్ కార్‌పార్కింగ్’ ప్రాజెక్టు ట్రయిల్ రన్ పనులను రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ సోమవారం పరిశీలించారు.
జగదాంబా సమీపంలో మల్టీలెవెల్ కార్ పార్కింగ్
ప్రగతి పరిశీలించిన మంత్రి బొత్స సత్యనారాయణ
విశాఖపట్నం, డిసెంబరు 28: ‘మల్టీలెవెల్ కార్‌పార్కింగ్’ ప్రాజెక్టు ట్రయిల్ రన్ పనులను రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ సోమవారం పరిశీలించారు. జీవీఎంసీ 29వ వార్డు జగదాంబ కూడలి సమీపంలో రాష్ట్రంలో తొలిసారి సింగపూర్ తరహా భవన నిర్మాణాన్ని చేపడుతున్న విషయం తెలిసిందే. రూ.10 కోట్ల వ్యయంతో వంద కార్లు ఒకేచోట పార్క్‌చేసేలా ఈ ప్రాజెక్టు నిర్మాణం చేపట్టారు. పనులు పరిశీలించిన బొత్స వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట దక్షిణం ఎమ్మెల్యే వాసుపల్లి గణేశ్‌కుమార్, గ్రేటర్ కమిషనర్ సృజన, పలువురు అధికారులు, స్థానిక పార్టీ నాయకులు ఉన్నారు.
Updated Date - 2020-12-29T06:09:54+05:30 IST