ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మరికొన్ని సడలింపులు

ABN, First Publish Date - 2020-06-01T09:12:25+05:30

లాక్‌డౌన్‌ నిబంధనల్లో మరికొన్నింటిని సడలించారు. ఇవి జూన్‌ ఎనిమిదో తేదీ నుంచి అమలులోకి వస్తాయని కలెక్టర్‌ వి.వినయ్‌చంద్‌

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎనిమిదో తేదీ నుంచి లాక్‌డౌన్‌ 5.0

మాల్స్‌, రెస్టారెంట్లు, హోటళ్లకు అనుమతి

ఆలయాలు, చర్చిలు, మసీదులకు వెళ్లొచ్చు

రాత్రి 9 నుంచి ఉదయం ఐదు గంటల వరకు కర్ఫ్యూ

మాస్క్‌ ఽధరించాలి, భౌతిక దూరం పాటించాలి

కంటెయిన్‌మెంట్‌ జోన్‌లో నెలాఖరు వరకు లాక్‌డౌన్‌

కలెక్టర్‌ వినయ్‌చంద్‌


విశాఖపట్నం, మే 31 (ఆంధ్రజ్యోతి):

లాక్‌డౌన్‌ నిబంధనల్లో మరికొన్నింటిని సడలించారు. ఇవి జూన్‌ ఎనిమిదో తేదీ నుంచి అమలులోకి వస్తాయని కలెక్టర్‌ వి.వినయ్‌చంద్‌ తెలిపారు. లాక్‌డౌన్‌ 5.0పై కేంద్రం జారీచేసిన మార్గదర్శకాలకు  అనుగుణంగా జిల్లాలో సడలింపులు, నిబంధనలపై ఆయన ఆదివారం రాత్రి ఒక ప్రకటన విడుదలచేశారు. కేంద్రం సడలించిన నిబంధనలు కంటెయిన్‌మెంట్‌ జోన్‌లకు వర్తించవని, ఈ ప్రాంతాల్లో జూన్‌ నెలాఖరుకు లాక్‌డౌన్‌ నిబంధనలు యథావిధిగా అమలులో ఉంటాయన్నారు. మిగిలిన ప్రాంతాల్లో జూన్‌ ఎనిమిది నుంచి పలు సంస్థలకు సడలింపులు ఇచ్చామన్నారు.

  • - హోటళ్లు, రెస్టారెంట్లు, షాపింగ్‌ మాల్స్‌ తెరుచుకోవచ్చు.
  • -మత సంబంధ, ప్రార్థనా స్థలాల్లో అనుమతి
  • - రాత్రి తొమ్మిది గంటల నుంచి మరుసటి రోజు ఉదయం ఐదు గంటల వరకు కర్ఫ్యూ అమలులో ఉంటుంది. అత్యవసర సేవలకు మినహాయింపు.
  • -కంటెయిన్‌మెంట్‌ జోన్‌లలో లాక్‌డౌన్‌ నిబంఽధనలు జూన్‌ 30 వరకు అమలులో ఉంటాయి. అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకు రాకూడదు.
  • -అన్ని రకాల విద్యా సంస్థలు, కోచింగ్‌ కేంద్రాలను తెరవకూడదు.
  • -అంతర్జాతీయ విమాన ప్రయాణాలు, సినిమా థియేటర్లు, వ్యాయామశాలలు, పార్కులు, స్విమ్మింగ్‌ పూల్స్‌, బార్లు, ఆడిటోరియాలకు సంబంధించి ఇంకా ఆదేశాలు వెలువడలేదు.
  • - 65 సంవత్సరాల పైబడిన వృద్ధులు, పదేళ్లలోపు పిల్లలు, గర్భిణిలు అత్యవసర పనులకు తప్ప బయటకు రాకూడదు.
  • -ఇతర రాష్ట్రాలు, జిల్లాల నుంచి రాకపోకలు, వస్తురవాణాకు ఎటువంటి అనుమతి అవసరంలేదు.
  • - ప్రతి ఒక్కరూ విధిగా మాస్క్‌ ధరించాలి. ఆరు అడుగుల భౌతికదూరం పాటించాలి.
  • - సభలు, సమావేశాలపై నిషేధం కొనసాగుతుంది. వివాహాలకు 50 మంది, అంత్యక్రియలకు 20 మందికి మించి పాల్గొనకూడదు

Updated Date - 2020-06-01T09:12:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising