ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నిరాడంబరంగా స్వాతంత్య్ర దినోత్సవం: కలెక్టర్‌

ABN, First Publish Date - 2020-08-13T11:20:58+05:30

కరోనా తీవ్రత నేపథ్యంలో స్వాతంత్య్ర దినోత్సవాన్ని నిరాడంబరంగా నిర్వహిస్తామని కలెక్టర్‌ వి.వినయ్‌చంద్‌ వెల్లడించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విశాఖపట్నం, ఆగస్టు 12(ఆంధ్రజ్యోతి): కరోనా తీవ్రత నేపథ్యంలో స్వాతంత్య్ర దినోత్సవాన్ని నిరాడంబరంగా నిర్వహిస్తామని కలెక్టర్‌ వి.వినయ్‌చంద్‌ వెల్లడించారు. పోలీస్‌ మైదానంలో నిర్వహించే కార్యక్రమానికి ముఖ్య అతిఽథిగా ఇన్‌చార్జి మంత్రి కురసాల కన్నబాబు హాజరుకానున్నట్టు తెలిపారు.  కరోనా బారిన పడి తీవ్ర అస్వస్థతకు గురై కోలుకున్న ఇద్దరు, ముగ్గురికి సత్కరిస్తామన్నారు.


కరోనా బాధితులకు  సేవలందిస్తున్న వైద్యులు, సిబ్బందికి సంబంధించి కేజీహెచ్‌ తరపున సూపరింటెండెంట్‌, వైద్యవిధానపరిషత్‌ నుంచి డీసీహెచ్‌ఎస్‌, వైద్య ఆరోగ్య శాఖ నుంచి డీఎంఅండ్‌హెచ్‌వో, ప్రైవేటు వైద్యుల తరపున ఐఎంఏ జిల్లా అధ్యక్షుడికి షీల్డులు అందజేస్తామన్నారు.  వేడుకలకు చిన్నపిల్లలు, ప్రజలను అనుమతించడం లేదన్నారు. జిల్లా అధికారులు, మీడియా, ప్రజాప్రతినిధులు హాజరవుతారని వివరించారు. ఇదిలావుండగా ఉత్సవాలు సాదాసీదాగా నిర్వహిస్తున్నా శకటాల ప్రదర్శన ఉంటుందని జిల్లా యంత్రాంగం ప్రకటించడాన్ని పలువురు తప్పుబడుతున్నారు. శకటాల తయారీకి వర్కర్లు రాక ఇబ్బందులు ఎదురవుతున్నాయని, శకటాల పరేడ్‌ రద్దు చేస్తే మంచిదని ఒక అధికారి అభిప్రాయపడ్డారు.

Updated Date - 2020-08-13T11:20:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising