అధికారంలో వచ్చాక విశాఖకు ఏం చేశారు..?
ABN, First Publish Date - 2020-12-20T05:57:05+05:30
అధికారంలోకి వచ్చిన తరువాత విశాఖను ఏం అభివృద్ధి చేశారని ఎమ్మెల్సీ బుద్ద నాగ జగదీశ్వరరావు శనివారం ఒక ప్రకటనలో ప్రశ్నించారు.
ఎమ్మెల్సీ బుద్ద నాగజగదీశ్
అనకాపల్లి, డిసెంబరు 19: అధికారంలోకి వచ్చిన తరువాత విశాఖను ఏం అభివృద్ధి చేశారని ఎమ్మెల్సీ బుద్ద నాగ జగదీశ్వరరావు శనివారం ఒక ప్రకటనలో ప్రశ్నించారు. విశాఖను పరిపాలన రాజధాని చేస్తామని అసెంబ్లీలో ప్రకటించిన తరువాత 72 వేల రిజిస్ట్రేషన్‌లు, 29 వేల ఎకరాల భూముల అమ్మకాలు జరిగి ఇన్‌సైడర్ ట్రేడింగ్‌కు పాల్పడింది ఎవరని ప్రశ్నించారు. రాజధానిలేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ను నిలబెట్టిన ఘనత జగన్‌రెడ్డికే దక్కుతుందన్నారు. ఏపీలో అరాచక పాలన సాగిస్తున్నారని, రాజ్యాంగం ఇచ్చిన స్వేచ్ఛను కాలరాస్తూ పౌరుల ప్రాథమిక హక్కులను హరించేస్తున్నారని జగదీశ్ పేర్కొన్నారు.
Updated Date - 2020-12-20T05:57:05+05:30 IST