పెందుర్తి సీహెచ్‌సీ అభివృద్ధికి చర్యలు
ABN, First Publish Date - 2020-11-04T02:31:36+05:30
పెందుర్తి సీహెచ్‌సీ అభివృద్ధికి అన్ని చర్యలు తీసుకుంటున్నామని ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదీప్‌రాజ్ తెలిపారు. పెందుర్తి సీహెచ్‌సీని మంగళవారం ఆయన సందర్శించారు.
ఎమ్మెల్యే అదీప్‌రాజ్
ఆస్పత్రిలో అభివృద్ధి పనులపై సమీక్ష
పెందుర్తి, నవంబరు 3: పెందుర్తి సీహెచ్‌సీ అభివృద్ధికి అన్ని చర్యలు తీసుకుంటున్నామని ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదీప్‌రాజ్ తెలిపారు. పెందుర్తి సీహెచ్‌సీని మంగళవారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ సీహెచ్‌సీ అభివృద్ధికి ప్రభుత్వం రూ.2.59 కోట్లు మంజూరు చేసిందని గుర్తు చేశారు. మంజూరైన నిధులతో ఆస్పత్రిలో చేపట్టే అభివృద్ధి పనులపై సమీక్షించారు. ఆస్పత్రిలోని రెండంతస్థుల ఆధునికీకరణ, సిబ్బంది క్వార్టర్స్, మార్చురీ, అంబులెన్స్ వాహనాల షెల్టర్, ప్రహారీ నిర్మాణం అంశాలపై నివేదిక రూపొందించారు. రెండు వారాల్లో సీహెచ్‌సీ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయాలని నిర్ణయించారు. ఆస్పత్రి అభివృద్ధి విషయంలో టీడీపీ నాయకులు చవకబారు రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. ఎమ్మెల్యే వెంట వైసీపీ విశాఖ రూరల్ జిల్లా అధ్యక్షుడు శరగడం చినఅప్పలనాయుడు, మార్కెట్ కమిటీ చైర్మన్ కోడిగుడ్ల దేవిసాంబ, వైసీపీ నాయకులు ముమ్మన దేవుడు, గొర్లె రామునాయుడు, ఎల్‌బీ నాయుడు, లెక్కల రమేశ్ ఉన్నారు.
Updated Date - 2020-11-04T02:31:36+05:30 IST