ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎమ్మెల్యే వాసుపల్లి ఉదారత

ABN, First Publish Date - 2020-12-16T05:28:30+05:30

కిడ్నీ సమస్యతో తీవ్ర అనారోగ్యానికి గురైన బాధితుడిపై విశాఖ దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌కుమార్‌ ఉదారత చూపారు.

బాధిత కుటుంబ సభ్యులకు రూ.5 లక్షల నగదు అందిస్తున్న ఎమ్మెల్యే వాసుపల్లి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కిడ్నీ బాధితుడికి రూ.5 లక్షల ఆర్థిక సాయం

  మహారాణిపేట, డిసెంబరు 15: కిడ్నీ సమస్యతో తీవ్ర అనారోగ్యానికి గురైన బాధితుడిపై విశాఖ దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌కుమార్‌ ఉదారత చూపారు. అతడి సమస్యను వివరించిన కుటుంబ సభ్యులకు ఏకంగా రూ.5 లక్షల నగదును అందించారు. గ్రేటర్‌ 29వ వార్డు చందకవీధికి చెందిన జి.ఈశ్వర్‌(28)కు కిడ్నిలు పాడైపోయాయి.  కొద్ది రోజులుగా మహారాణిపేట లోని ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నాడు. అయితే అందుకు బాగా డబ్బు అవసరం కావడంతో దాతల కోసం కుటుంబ సభ్యులు తిరుగుతున్నారు. మంగళవారం ఎమ్మెల్యే వార్డు పర్యటనలో ఉండగా  29 వవార్డు వైసీపీ అధ్యక్షుడు పీతల వాసు ఆధ్వర్యంలో ఈశ్వర్‌, అతని భార్య, కుటుంబ సభ్యులు ఎమ్మెల్యేని కలసి సమస్యను వివరించారు. దీంతో తక్షణమే స్పందించిన ఎమ్మెల్యే వాసుపల్లి అతడికి రూ.5 లక్షల నగదను అందజేశారు. ఈశ్వర్‌ ఆరోగ్యంపై ఆస్పత్రి అధికారులతో చర్చించి మెరుగైన వైద్యం అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కనకల ఈశ్వర్‌, కోరాడ సురేష్‌, బెవర మహేశ్‌, అడపా శివ, తేజ, చందకవీధి వాసులు పాల్గొన్నారు. 

 

Updated Date - 2020-12-16T05:28:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising