ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మాంసం దుకాణాలపై దాడులు

ABN, First Publish Date - 2020-04-06T10:18:50+05:30

తూనికలు, కొలతలుశాఖ అధికారులు జిల్లాలోని పలు ప్రాంతాల్లోని మాంసం దుకాణాలు, రేషన్‌ డిపోలు, రైతు బజార్లలో ఆకస్మిక దాడులు నిర్వహించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తూకంలో తేడాలుండడంతో తొమ్మిది మందిపై కేసులు


విశాఖపట్నం, ఏప్రిల్‌ 5, (ఆంధ్రజ్యోతి) : తూనికలు, కొలతలుశాఖ అధికారులు జిల్లాలోని పలు ప్రాంతాల్లోని మాంసం దుకాణాలు, రేషన్‌ డిపోలు, రైతు బజార్లలో ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో  వినియోగదారులను మోసం చేస్తూ విక్రయాలు సాగించినట్టు గుర్తించారు. కేజీకి  50 నుంచి 200 గ్రాముల వరకు మాంసాన్ని తక్కువగా విక్రయించిన 12 మంది దుకాణదారులపై  కేసులు నమోదు చేశారు. నర్సీపట్నం, అనకాపల్లి, నగర పరిధిలోని గాజువాక, ఎండాడ, మధురవాడ తదితర ప్రాంతాల్లో మాంసం దుకాణాలపై అధికారులు దాడులు నిర్వహించారు. జిల్లాలోని 15 చోట్ల రేషన్‌ డిపోల్లో తనిఖీలు నిర్వహించారు. నాలుగు చోట్ల బియ్యం తూకంలో తేడాలుండడంతో కేసులు నమోదు చేశారు. కంట్రోలర్‌ లీగల్‌ మెట్రాలజీ కాంతారావు, డిప్యూటీ కంట్రోలర్‌ మధుసూదన్‌రెడ్డి ఆదేశాల మేరకు అధికారులు ఈ తనిఖీలను నిర్వహించారు. 


మాంసం దుకాణాల్లో తనిఖీలు

అనకాపల్లి టౌన్‌: పట్టణంలోని మాంసం దుకాణాల్లో ఆదివారం తూనికలు- కొలతలశాఖ తనిఖీలు చేపట్టింది. కిలో మాంసానికి 200 గ్రాములు తేడాను గుర్తించిన అధికారులు  తొమ్మిది మందిపై కేసులు నమోదు చేశారు.  తూనికలు- కొలతలశాఖ అసిస్టెంట్‌ కంట్రోలర్‌ పీవీ రంగారెడ్డి  ఇన్‌స్పెక్టర్‌ డి.భాస్కరరావు,  వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-04-06T10:18:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising