పోలీసు వ్యవస్ధపై సంపూర్ణ అవగాహనతోనే రాణింపు
ABN, First Publish Date - 2020-12-20T05:53:14+05:30
సచివాలయాల్లోని మహిళా పోలీసులు, పోలీసు వ్యవస్థపై సంపూర్ణంగా అవగాహన ఏర్పరచుకుంటే చక్కగా రాణించగలుగుతారని ‘దిశ’ డీఎస్‌పీ ప్రవీణ్‌కుమార్ అన్నారు.
మహిళా పోలీసుల శిక్షణలో ’దిశ’ డీఎస్‌పీ ప్రవీణ్‌కుమార్
పాడేరు, డిసెంబరు 19: సచివాలయాల్లోని మహిళా పోలీసులు, పోలీసు వ్యవస్థపై సంపూర్ణంగా అవగాహన ఏర్పరచుకుంటే చక్కగా రాణించగలుగుతారని ‘దిశ’ డీఎస్‌పీ ప్రవీణ్‌కుమార్ అన్నారు. స్థానిక కాఫీహౌస్‌లో స్థానిక పోలీస్ సబ్‌డివిజన్ పరిధిలోని సచివాలయ మహిళా పోలీసులకు ఒక్కరోజు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చట్టాలపై అవగాహన ఏర్పరచుకుని, పరిస్థితులపై పట్టు సాధించి శాంతిభద్రతలను పరిరక్షించేందుకు కృషిచేయాలన్నారు. స్థానిక డీఎస్‌పీ వీబీ.రాజ్‌కమల్ మాట్లాడుతూ... గతంలో సచివాలయ మహిళా పోలీసులకు రెండు వారాలు శిక్షణ ఇచ్చామని, అయినప్పటికీ మరో మారు శిక్షణ ఇవ్వాలనే లక్ష్యంతో ఈకార్యక్రమం చేపట్టామన్నారు. పోలీసింగ్‌కు అవసరమైన ఐసీపీ, సీఆర్‌పీసీ సెక్షన్లు, దిశ, పోలీస్, క్రైమ్ యాప్‌ల గురించి అవగాహన ఏర్పరచుకోవాలన్నారు. ఈకార్యక్రమంలో సీఐలు పీపీ.నాయుడు, రేవతమ్మ, దిశ ఎస్‌ఐ హైమావతి, మరో ఎస్‌ఐ అశోక్‌కుమార్ పాల్గొన్నారు.
Updated Date - 2020-12-20T05:53:14+05:30 IST