ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మార్టూరు రాయి క్వారీల్లో అక్రమాలు

ABN, First Publish Date - 2020-11-27T05:41:10+05:30

మండలంలోని మార్టూరు గ్రామ పరిధిలో రెండు రాయి క్వారీల నిర్వాహకులు అక్రమాలకు పాల్పడినట్టు నిర్ధారణ కావడంతో ఆయా యజమానులకు రూ.20.95 కోట్లు జరిమానా విధించినట్టు గనుల శాఖ విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఏడీ ప్రతాపరెడ్డి తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రెండు కంపెనీలకు రూ.20.95 కోట్ల జరిమానా


అనకాపల్లి, నవంబరు 26: మండలంలోని మార్టూరు గ్రామ పరిధిలో రెండు రాయి క్వారీల నిర్వాహకులు అక్రమాలకు పాల్పడినట్టు నిర్ధారణ కావడంతో ఆయా యజమానులకు రూ.20.95 కోట్లు జరిమానా విధించినట్టు గనుల శాఖ విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఏడీ ప్రతాపరెడ్డి తెలిపారు. అపర్ణ ఎంటర్‌ప్రైజెస్‌ క్వారీ యాజమాన్యం సర్వే నంబరు 1లో గల 6.04 హెక్టార్లలో 3,23,031 క్యూబిక్‌ మీటర్ల మెటల్‌, గ్రావెల్‌ తవ్వడానికి అనుమతులు తీసుకుందని, కానీ 34,114 క్యూబిక్‌ మీటర్లు మాత్రమే ఇక్కడ తవ్వి, మిగిలిన 2,88,917 క్యూబిక్‌ మీటర్ల మెటల్‌ను వేరే చోట తవ్వి ఇక్కడ తవ్వినట్టు లెక్కలు చూపించిందన్నారు. అలాగే 1,944 క్యూబిక్‌ మీటర్ల గ్రావెల్‌ అదనంగా తవ్వినట్టు గుర్తించామన్నారు. లీజు అనుమతులు ఉల్లంఘించిన అపర్ణ ఎంటర్‌ప్రైజెస్‌ క్వారీ నిర్వాహకులకు రూ.16.48 కోట్ల జరిమానా విధించామని చెప్పారు. అలాగే అంజనీ స్టోన్‌ క్రషర్‌ యాజమాన్యం అక్రమంగా రాయి తవ్వకాలు చేపట్టినందుకు రూ.4.47 కోట్ల జరిమానా విధించామన్నారు. 

Updated Date - 2020-11-27T05:41:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising