ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వ్యక్తి ఆత్మహత్యాయత్నం.. కాపాడిన హోంగార్డు

ABN, First Publish Date - 2020-12-06T04:11:58+05:30

వ్యక్తిగత కారణాలతో మనస్తాపం చెందిన ఓ వ్యక్తి సముద్రంలోకి దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా మెరైన్‌ పోలీసు రక్షించి ఒడ్డుకు చేర్చాడు.

ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన వ్యక్తితో మెరైన్‌ పోలీసులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పరవాడ : వ్యక్తిగత కారణాలతో మనస్తాపం చెందిన ఓ వ్యక్తి సముద్రంలోకి దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా మెరైన్‌ పోలీసు రక్షించి ఒడ్డుకు చేర్చాడు. దీనికి సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలిలా వున్నాయి. వాడచీపురుపల్లి గ్రామానికి చెందిన మారేడిపూడి కృష్ణ (42) గత కొంత కాలంగా వ్యక్తిగత కారణాలతో మనస్తాపానికి గురయ్యాడు. దీంతో జీవితంపై విరక్తి చెంది శనివారం ముత్యాలమ్మపాలెం సముద్ర తీరంలోకి వెళ్లి ఆత్మహత్యకు ప్రయత్నించాడు. ఆ సమయంలో అక్కడే విధులు నిర్వహిస్తున్న మెరైన్‌ హోంగార్డు సీహెచ్‌ అప్పారావు గమనించి సముద్రంలో కొట్టుకుపోతున్న కృష్ణను కాపాడి ఒడ్డుకు తీసుకొచ్చాడు. అనంతరం పరవాడ స్టేషన్‌కు అప్పగించారు. ఈ మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2020-12-06T04:11:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising