ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మహాశివరాత్రికి 200 ప్రత్యేక సర్వీసులు

ABN, First Publish Date - 2020-02-20T08:34:16+05:30

మహాశివరాత్రి సందర్భంగా శుక్రవారం వివిధ ఆధ్యాత్మిక ప్రాంతాలకు 200 ప్రత్యేక సర్వీసులు నడిపేందుకు పౌర రవాణా శాఖ విశాఖ రీజియన్‌ యాజమాన్యం నిర్ణయించింది. వివిధ ఆలయాలకు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ద్వారకాబ్‌సస్టేషన్‌, ఫిబ్రవరి 19 : మహాశివరాత్రి సందర్భంగా శుక్రవారం వివిధ ఆధ్యాత్మిక ప్రాంతాలకు 200 ప్రత్యేక సర్వీసులు నడిపేందుకు పౌర రవాణా శాఖ విశాఖ రీజియన్‌ యాజమాన్యం నిర్ణయించింది. వివిధ ఆలయాలకు, దర్శనీయ స్థలాలకు రాకపోకలు సాగించే భక్తులకు రవాణా పరంగా ఎటువంటి ఇబ్బందులు కలుగకూడదన్న ఉద్దేశంతో ఈ ప్రత్యేక సర్వీసులు ఆపరేట్‌ చేస్తున్నట్టు రీజనల్‌ మేనేజర్‌ ఎంవై దానం తెలిపారు. రామకృష్ణా బీచ్‌లో టీఎస్సార్‌ కళా పీఠం నిర్వహించే మహాశివరాత్రి ఉత్సవాలకు గాజువాక నుంచి 25, సింహాచలం నుంచి 25 ప్రత్యేక సర్వీసులు ఆపరేట్‌ చేయనుంది. ఈ ప్రత్యేక సర్వీసులు శుక్రవారం ఉదయం నుంచి శనివారం ఉదయం వరకు నిర్విరామంగా రవాణా సేవలందిస్తాయని అధికారులు వెల్లడించారు. షెడ్యూల్‌ సర్వీసులకు అదనంగా వీటిని నడిపేందుకు ఏర్పాట్లు చేసింది. కల్యాణపులోవ తీర్థానికి చోడవరం నుంచి 15, రావికమతం నుంచి 15, కొత్తకోట నుంచి 10, నర్సీపట్నం నుంచి 15 ప్రత్యేక బస్సులు నడిపేందుకు ప్రణాళిక సిద్ధం చేసింది. అప్పికొండ సోమేశ్వరాలయానికి పాత గాజువాక నుంచి 35, అగనంపూడి నుంచి 15 ప్రత్యేక సర్వీసులు నడపనుంది. పుణ్యగిరి తీర్థానికి అనకాపల్లి నుంచి 10 బస్సులు, దారమఠం తీర్థానికి నర్సీపట్నం నుంచి 20 ప్రత్యేక సర్వీసులు, మత్స్యగుండం తీర్థానికి పాడేరు నుంచి 15 ప్రత్యేక బస్సులు నడిపేందుకు విశాఖ రీజియన్‌ యాజమాన్యం నిర్ణయించింది. ఈ రవాణా సౌకర్యాన్ని భక్తులు వినియోగించుకోవాలని ఆర్‌ఎం కోరారు. 

Updated Date - 2020-02-20T08:34:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising