ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

7న సరిపల్లి పెంటయ్య మృతిపై న్యాయ విచారణ

ABN, First Publish Date - 2020-08-05T10:35:44+05:30

సరిపల్లి పెంటయ్య మృతిని లాకప్‌ డెత్‌గా పరిగణించి న్యాయ విచారణ జరపనున్నట్టు రెవెన్యూ డివిజినల్‌ అధికారి ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మహారాణిపేట, ఆగస్టు 4: సరిపల్లి పెంటయ్య మృతిని లాకప్‌ డెత్‌గా పరిగణించి న్యాయ విచారణ జరపనున్నట్టు రెవెన్యూ డివిజినల్‌ అధికారి పెంచల కిశోర్‌ తెలిపారు. విశాఖ జిల్లా పెదగంట్యాడ మండలం గొడ్డువానిపాలేనికి చెందిన సరిపల్లి పెంటయ్యను విశాఖ కేంద్ర కారాగారం నుంచి ఈ ఏడాది జనవరి 28వ తేదీన చికిత్స నిమిత్తం  కేజిహెచ్‌కి తరలించగా చికిత్స పొందుతూ ఫిబ్రవరి 4వ తేదీన మృతి చెందాడని తెలిపారు.


దీంతో అతని మృతిని లాకప్‌ డెత్‌గా నిర్ధారించామన్నారు. దీనిపై న్యాయ విచారణ జరిపేందుకు రెవెన్యూ డివిజినల్‌ అధికారి, సబ్‌డివిజినల్‌ మెజిస్ట్రేట్‌లను విచారణాధికారిగా నియమించినట్టు తెలిపారు.  ఈ నెల 7వ తేదీ ఉదయం 11 గంటలకు  ఆర్‌డీవో సబ్‌డివిజన్‌ మెజిస్టీరియల్‌ కార్యాలయంలో న్యాయ విచారణ జరపనున్నామన్నారు. పెంటయ్య మృతిపై వివరాలు తెలిసిన వారు  విచారణకు హజరై లిఖితపూర్వకంగా గానీ, మౌఖికంగా  గానీ తెలియజేయవచ్చని తెలిపారు.

Updated Date - 2020-08-05T10:35:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising