ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జిల్లాలో 1012 ‘జీవ‌ క్రాంతి’ యూనిట్లు

ABN, First Publish Date - 2020-12-11T05:01:12+05:30

రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ‘జీవన్‌ క్రాంతి’ పథకం ద్వారా జిల్లాకు 1012 యూనిట్లు మంజూరు కానున్నాయని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, కలెక్టర్‌ వినయ్‌చంద్‌ తెలిపారు.

చెక్కులు అందజేస్తున్న మంత్రి ముత్తంశెట్టి, కలెక్టర్‌ వినయ్‌చంద్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చెక్కులు అందజేసిన మంత్రి ముత్తంశెట్టి, కలెక్టర్‌ వినయ్‌చంద్‌

మహారాణిపేట, డిసెంబరు 10: రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ‘జీవ క్రాంతి’ పథకం ద్వారా జిల్లాకు 1012 యూనిట్లు మంజూరు కానున్నాయని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, కలెక్టర్‌ వినయ్‌చంద్‌ తెలిపారు. ఇందుకోసం లబ్ధిదారులకు 7.59 కోట్ల రూపాయలు అందజేయనున్నట్లు తెలిపారు. ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి గురువారం వర్చువల్‌ విధానంలో పథకం ప్రారంభోత్సవం సందర్భంగా ఏర్పాటుచేసిన వీడియో కాన్ఫరెన్స్‌లో వీరు పాల్గొన్నారు.


ఈ సందర్భంగా మంత్రి ముత్తంశెట్టి మాట్లాడుతూ బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల్లో ఇది మరొకటని తెలిపారు. ప్రతి లబ్ధిదారునికి నాలుగేళ్లలో ఐదు లక్షల రూపాయలు అందుతాయని, పథకాన్ని లబ్ధిదారులు సద్వినియోగం చేసుకుని అభివృద్ధి సాధించాలని సూచించారు. అనంతరం లబ్ధిదారులకు రూ.7.59 కోట్ల చెక్కును మంత్రి, కలెక్టర్‌ అందించారు. ఈ కార్యక్రమంలో అరకు ఎంపీ గొడ్డేటి మాధవి, జాయింట్‌ కలెక్టర్‌ గోవిందరావు, పశుసంవర్థక శాఖ జేడీ డాక్టర్‌ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. 

 

Updated Date - 2020-12-11T05:01:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising