ఐటీడీఏ పీవోగా వెంకటేశ్వర్
ABN, First Publish Date - 2020-05-24T08:15:38+05:30
స్థానిక సబ్‌కలెక్టర్ వెంకటేశ్వర్‌ని ఐటీడీఏ పీవోగా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది
సబ్‌కలెక్టర్‌గా ఆయనకే పూర్తి అదన పు బాధ్యతలు
పాడేరు: స్థానిక సబ్‌కలెక్టర్ వెంకటేశ్వర్‌ని ఐటీడీఏ పీవోగా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇక్కడ ఐటీడీఏ పీవోగా పని చేసిన డీకే.బాలాజీని ఏప్రిల్ 30న కర్నూలు మున్సిపల్ కమిషనర్‌గా బదిలీ చేసింది. దీంతో సబ్‌కలెక్టర్‌గా ఉన్న ఎస్.వెంకటేశ్వర్‌కు ఐటీడీఏ పీవోగా ఇన్‌ఛార్జి బాధ్యతలు అప్పగించింది. అయితే ఐటీడీఏ పీవోగా వెంకటేశ్వర్‌ని నియమిస్తూ, ఆయనకే సబ్‌కలెక్టర్‌గా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
Updated Date - 2020-05-24T08:15:38+05:30 IST